Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Fitness Good Relief Exercises For Back Pain

Back Pain Exercises: నడుం నొప్పి వేధిస్తోందా? తగ్గించే వ్యాయామాలు ఇవే!

Published Date :January 24, 2023 , 3:11 pm
By GSN Raju
Back Pain Exercises: నడుం నొప్పి వేధిస్తోందా? తగ్గించే వ్యాయామాలు ఇవే!

ఈరోజుల్లో నడుం నొప్పి చాలా సర్వసాధారణం అయిపోయింది. అధిక బరువు కారణంగానే నడుం నొప్పి ఎక్కువగా వేధిస్తుంటుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుండి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఆధునిక జీవనశైలితో మనకు వచ్చే సమస్యలలో నడుము నొప్పి (Back Pain) ప్రధానమయినదని చెప్పాలి. గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా న‌డుము నొప్పి బారిన పడే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.

నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివార‌ణ కొరకు మందులు వాడ‌డం మొదలుపెడుతుంటారు. అది ఎంతమాత్రం మంచిది కాదు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త రిలీఫ్ లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల క్రీడలు ఆడేవారు ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. మెడిసిన్ వాడాల్సిన ప‌ని లేకుండానే కింద ఇచ్చిన కొన్ని స‌హ‌జ సిద్ధమైన ఆరోగ్య చిట్కాల (Health Tips)ను పాటించడం మందిచిది. నడుము నొప్పి తగ్గడానికి గ్లాసు పాలలో ఓ రెండు, మూడు చెంచాల తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Read Also: Earthquake: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం.. ఈ నెలలోనే మూడో సారి

నొప్పి అధికంగా ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచి తీసేస్తే ప్రయోజనం ఉంటుంది. చిన్న అల్లం నీటిలో వేసి వేడిచేయాలి. వడగట్టి చల్లార్చాలి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవడం మంచిది. అదేపనిగా ఎక్కువ సేపు కూర్చోవడం ద్వారా నడుము నొప్పితో పాటు ఒబేసిటీ బారినపడే ప్రమాదం ఉంది. గ్లాసు పాలలో కొంచెం గసగసాల పొడి ప్రతిరోజూ ఒకసారి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. నడుం నొప్పి మీ దరికి చేరకుండా ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. నడుం నొప్పి ఉన్నప్పుడు వ్యాయామం (exercise) చేయవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేయాలి. నడుం నొప్పి ఉన్నవారు వెన్నెముకకు బలాన్నిచ్చే వ్యాయామాలు రోజూ చేయాలి. దీని ద్వారా నడుం నొప్పికి చెక్ పెట్టవచ్చు. నడుముకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి (pain), వాపు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో నొప్పి ఉన్న చోట చల్లని లేదా వేడి వాటితో కాపడం పెట్టడం వల్ల నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. నడుం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు యోగ, ఈత వంటి సులభమైన వ్యాయామాలు చేయాలి.

నేలపై వెల్లకిలా పడుకుని శరీరానికి విశ్రాంతినిస్తే నడుం నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని పద్దతులలో కాళ్ళకు బరువులు వేలాడదీసి వెన్నుపూసలోని మార్పులను సవరించేలా చికిత్స అందించాలి. నడుం నొప్పికి యోగాసనాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ప్రత్యేకించి మకరాసనం, సర్పాసనం, భుజంగాసనం,వజ్రాసనం, చక్రాసనం, శలాభాసనాలు నడుం నొప్పి నివారణకు సహకరిస్తాయి. అయితే, నడుము నొప్పి తీవ్రంగా వున్నప్పుడు ఆసనాల జోలికి వెళ్ళకూడదు.

Read Also: TSRTC : వసంత పంచమి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

ntv google news
  • Tags
  • asanas
  • Back Pain
  • Health Tips
  • Hot Water Reilef
  • NTV Telugu

WEB STORIES

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

RELATED ARTICLES

Health Tips: మీరు ఆరోగ్యవంతులేనా..? మీరే ఇలా చెక్‌చేసుకోండి..

Over Sleeping : అతిగా నిద్రపోతే.. అటునుంచి అటే

Holding Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే ఎంతటి డేంజరో తెలుసా?

Aloe Vera : అలోవెరాతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Hair Problem Tips: జుట్టు ఒత్తుగా, మృదువుగా వుండాలంటే ఇలా చేయాలంట!

తాజావార్తలు

  • Sreeleela: అందమే అసూయ పడదా.. నీ నగుమోము సౌందర్యం చూసి

  • Meenakshi Chaudhary: సూర్యుడికే చెమటలు పట్టించే అందం.. నీ సొంతం మీనా

  • Vey Daruvey: నాగచైతన్య చేతుల మీదుగా ‘వెయ్ దరువెయ్’ టైటిల్ సాంగ్ రిలీజ్

  • Mrunal Thakur : చీరకట్టులో మృణాల్ ఠాకూర్ ఫోటోలు అదుర్స్‌..

  • USPC : పైరవీ బదిలీలు ఆపాలి.. జీరో సర్వీసు బదిలీలకు అనుమతి ఇవ్వాలి

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions