Healthy Breakfast: చుక్క నూనె లేకుండా హై ప్రోటీన్, హెల్తీ టిఫిన్స్.. బరువు తగ్గేందుకు బెస్ట్ ఛాయిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Top 6 Healthy Low-Calorie High-Protein Indian Breakfast: మనం ఉదయం తీసుకునే అల్పాహారం ఆ రోజంతా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే అధిక ప్రొటీన్ ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే ఆకలి త్వరగా అవ్వదు. అయితే రుచి కోసం ఎక్కువ నూనె, ఎక్కువ కేలరీలు తీసుకోవాల్సిందే అనుకోవాల్సిన పనిలేదు. కొంచెం జాగ్రత్తగా ఎంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే రుచికరమైన అల్పాహారం ఆస్వాదించవచ్చు. బరువు తగ్గాలని భావిస్తున్నా, తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవాలనుకున్నా, ఉదయం తేలికగా ఉండాలనుకునే వాళ్లకోసం టాఫ్ 6 బెస్ట్ టిఫిన్స్ గురించి చూద్దాం..
1. పోహా..
ఉదయం సులభంగా తయారయ్యే పోహా చాలా మందికి ఇష్టమే. అటుకులతో చేసే ఈ వంటలో సాధారణంగా కొంచెం నూనె వేస్తారు. కానీ నూనె లేకుండానే చేయవచ్చు. అటుకులను స్వల్పంగా వేడి చేసి, ఉల్లిపాయ, బటానీ, పసుపు వేసి కొద్దిగా నీళ్లు చల్లి ఉడికిస్తే సరిపోతుంది. చివర్లో కొత్తిమీర, కొబ్బరి తురుము, నిమ్మరసం వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. తేలికగా ఉండే ఈ వంటకం కడుపునిండా తృప్తి ఇస్తుంది.
Also Read
- Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
- Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
- Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
- Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
2. ఉప్మా
ఉప్మా అంటే చాలామందికి రవ్వ గుర్తుకొస్తుంది. కానీ రవ్వకు బదులుగా ఓట్స్‌తో కూడా రుచికరమైన ఉప్మా చేయవచ్చు. ముందుగా ఓట్స్‌ను స్వల్పంగా వేయించి, క్యారెట్, బటానీ, క్యాప్సికం వంటి కూరగాయలతో కలిపి ఉడికిస్తే చాలు. ఆవాలు, కరివేపాకు, పసుపు వేస్తే మంచి వాసన వస్తుంది. ఇది పొట్ట నిండేలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.
3. ఇడ్లీ..
ఇడ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిరిలో వండే ఈ వంటకం సహజంగానే తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలకు కూరగాయలతో చేసిన సాంబారు, తక్కువ నూనెతో చేసిన కొబ్బరి చట్నీ కలిస్తే మంచి కాంబినేషన్ అవుతుంది. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ ఉదయం కోసం బెస్ట్ టిఫిన్..
4. దలియా..
గోధుమ రవ్వతో చేసే దలియా కూడా మంచి అల్పాహారం. గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్, బీన్స్, బటానీ వంటి కూరగాయలతో కలిపి నీళ్లలో ఉడికిస్తే రుచిగా ఉంటుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసినా సరిపోతుంది. వేడి వేడి దలియా శరీరానికి శక్తిని ఇస్తుంది.
5. మొలకలు..
మొలకలు వచ్చిన పప్పులతో చేసే సలాడ్ బెస్ట్ టిఫిన్‌గా మారుతుంది. పెసర, శనగ, ఇతర పప్పులతో చేసిన మొలకలను దోసకాయ, టమోటా, ఉల్లిపాయ ముక్కలతో కలపాలి. నిమ్మరసం, కొద్దిగా చాట్ మసాలా లేదా వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. ఇది ప్రోటీన్‌తో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం.
6. రాగి దోశ..
రాగితో చేసే దోశ కూడా మంచి ఎంపిక. రాగి పిండి, నీళ్లు, కొద్దిగా ఉప్పు కలిపి మిశ్రమం తయారు చేసి తొక్కపై పోసి దోరగా కాల్చాలి. దీనికి కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీ కలిపితే చాలా రుచిగా ఉంటుంది. రాగి శరీరానికి బలం ఇస్తుంది. ఈ విధంగా నూనె లేకుండా రుచికరమైన టిఫిన్స్ చేసుకోవచ్చు. తప్పక ట్రై చేయండి
తాజావార్తలు
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
-
Raviteja : రవితేజ కెరీర్‌కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
-
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!