Instant Ragi Uttapam: కాల్షియం ఫుల్.. రుచి డబుల్.. పది నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రాగి ఉత్తప్పం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instant Ragi Uttapam: రాగులు చిరు ధాన్యాలలో ఒకటి. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో రాగులను రాగి సంగటి, రాగి అంబలి తయారు చేసుకుని తీసుకుంటారు. మరికొందరు రాగి రొట్టెలు, రాగి లడ్డులూ, రాగి పిండితో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని తింటారు. ప్రస్తుతం మనం రాగితో ఒక అద్భుత రెసిపీ చేసుకుందాం.. అదే ఇన్స్టంట్ రాగి ఉత్తప్పం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా పిల్లలు-పెద్దలు అందరికీ సరిపోతుంది.
READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ఇన్స్టంట్ రాగి ఉత్తప్పం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రవ్వ వేసుకోవాలి. దానికి మూడు నాల్గవ వంతు పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో రాగి పిండి వేసి మళ్లీ కలపాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి క్యాప్సికం, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. మిగిలిన పెరుగు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి దోసె మిశ్రమంలా ఉండేలా కలపాలి. ఇది ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టౌపై నాన్‌స్టిక్ తవా వేడి చేయాలి. ఈలోగా మిశ్రమంలో కరివేపాకు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి మెల్లగా కలపాలి. తవా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి టిష్యుతో తుడవాలి. ఒక గరిటె మిశ్రమం తీసుకుని తవాపై పోసి ఉత్తప్పంలా మెల్లగా పరచాలి. కింద భాగం లేత బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. తర్వాత చిన్న కత్తితో స్వల్పంగా చీలికలు చేసి, మరొక వైపు తిప్పి క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. వేడివేడిగా చట్నీ లేదా పెరుగుతో సర్వ్ చేస్తే చాలా రుచిగా అద్భుతః.. తప్పక ట్రై చేయండి సుమీ..
ఇప్పుడు దీనిలో ఉన్న పోషక విలువలు గురించి తెలుసుకుందాం. ఈ రాగి ఉత్తప్పం ద్వారా శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ శరీర బలానికి ఉపయోగపడుతుంది. కొవ్వు పరిమాణం కూడా సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..