Instant Ragi Dosa Recipe: మన తాతలు, ముత్తాతలు రాగులు తిని ఎన్నో ఏళ్లు బతికారు. కానీ.. ప్రస్తుతం జీవన శైలి మారింది. చాలా మంది రాగుల గురించి మర్చిపోయారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో రాగి సంకటి, నాటు కోడి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మన దక్షిణ భారత ఇంట్లలో రాగి అంటేనే ఆరోగ్యం గుర్తుకు వస్తుంది. చలికాలమైనా, వేసవైనా రాగితో చేసిన వంటలు శరీరానికి బలం ఇస్తాయని పెద్దలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అలాంటి రాగితో చేసే రాగి దోశ ఇప్పుడు చాలా మందికి ఫేవరెట్ అవుతోంది. ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ దోశలు తేలికగా జీర్ణమవుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాధారణంగా దోశ అంటే బియ్యం, పప్పులతో చేసిన పిండి గుర్తుకు వస్తుంది. కానీ రాగి దోశల్లో ప్రధానంగా రాగిపిండి వాడతారు. అదే ఈ దోశలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. రాగి దోశలను మూడు విధాలుగా చేయొచ్చు. వెంటనే చేసుకునే ఇన్‌స్టంట్ దోశ, మిగిలిపోయిన దోశ పిండితో చేసే దోశ, అలాగే పులియబెట్టిన పిండితో చేసే విధానం. ఇప్పుడు ఇన్‌స్టంట్ రాగి దోశ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: KCR : సిట్‌కు కేసీఆర్ 6 పేజీల ఘాటు లేఖ.. నోటీసులు అక్రమం.. అయినా విచారణకు వస్తా.!
ముందుగా కావాల్సిన పదార్థాలు: అర కప్పు రాగి పిండి, పావు కప్పు బియ్యం పిండి లేదా గోధుమ పిండి, రెండు టేబుల్ స్పూన్లు సన్నని సూజీ (లేదా బియ్యం పిండి), రెండు కప్పుల నీళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి (పిల్లలకు అయితే మిరియాల పొడి వాడొచ్చు), కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఉప్పు, జీలకర్ర, చివరగా దోశలు కాల్చడానికి నెయ్యి లేదా నూనె అవసరం. ఇక.. ముందగా గిన్నెలో ముందుగా నూనె లేదా నెయ్యి తప్ప మిగతా పొడి పదార్థాలన్నీ వేసుకోవాలి. అందులో సగం నీళ్లు పోసి బాగా కలపాలి. ముద్దలు లేకుండా కలిసిన తర్వాత మిగిలిన నీటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపాలి. పిండి గట్టిగా కాకుండా చాలా పలుచగా ఉండాలి. పలుచగా ఉంటే దోశ పలుచగా, క్రిస్పీగా వస్తుంది. కొంచెం మందంగా కావాలంటే పిండి కాస్త గట్టిగా ఉంచుకోవచ్చు. ఈ పిండిని పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోపు చట్నీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేయడానికి బాణలిని బాగా వేడిచేయాలి. బాణలిపై కొద్దిగా నీళ్లు చల్లితే వెంటనే ఆవిరైపోతే, బాణలి సరైన వేడిలో ఉందని అర్థం. రాగి పిండి కిందకి కూర్చుంటుంది కాబట్టి, ప్రతి దోశ వేసే ముందు పిండిని బాగా కలపాలి.
READ MORE: Viral : టాబ్లెట్ షీట్ అనుకున్నారా..? అది వెడ్డింగ్ కార్డు..!
మంటను మధ్యస్థంగా ఉంచి, పిండిని బాణలి అంచుల నుంచి వృత్తాకారంలో పోయాలి. మధ్యలో ఖాళీలు ఉంటే, అక్కడ కూడా కొద్దిగా పిండి పోయాలి. ఇప్పుడు దోశ అంచుల చుట్టూ, పైభాగంలో కొద్దిగా నెయ్యి లేదా నూనె చల్లాలి. సుమారు మూడు నిమిషాలు వేయిస్తే అంచులు బాణలిని వదులుతాయి. అప్పుడు మెల్లగా తిప్పి మరోవైపు ఒక నిమిషం వేయించాలి. మళ్లీ తిప్పి అడుగు భాగం క్రిస్పీగా అయ్యేవరకు ఇంకో నిమిషం ఉంచాలి. మొత్తం దోశ కాల్చడానికి సుమారు ఐదు నిమిషాలు పడుతుంది. ఇది బాణలి, మంట మీద ఆధారపడి కొంచెం తేడా ఉండొచ్చు. దోశ సిద్ధమైన తర్వాత ప్లేట్‌లోకి తీసేయాలి. తర్వాతి దోశ వేయే ముందు బాణలి మళ్లీ బాగా వేడిగా ఉందో లేదో చూసుకోవాలి. పిండిని కలపకుండా నేరుగా పోస్తే, పైగా నీరు మాత్రమే వచ్చి పెద్ద రంధ్రాలు పడతాయి. ఇక మృదువుగా, మందంగా ఉండే రాగి దోశలు సైతం చేయొచ్చు. ఇవి ఎక్కువ కడుపు నింపుతాయి. పది నెలల పైబడిన పిల్లలకు కూడా ఇవి మంచివి. అలాంటి దోశల కోసం సూజీ పరిమాణాన్ని రెట్టింపు చేసి, రుచికి రెండు నుంచి నాలుగు స్పూన్లు తాజా పెరుగు కలిపితే బాగుంటుంది. పుల్లని పెరుగు మాత్రం వాడకూడదు. ఈ దోశలు లంచ్ బాక్స్‌లో పెట్టినా బాగానే ఉంటాయి.