Maggi masala : వంట గదిలోనే 10 నిమిషాల్లో మ్యాగీ మసాలా రెడీ.. రుచి కూడా అమోఘం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maggi masala : వంటగదిలో ఉండే కొన్ని చిన్న చిన్న రహస్యాలే ఇంటి వంటను హోటల్ స్టైల్‌గా మార్చేస్తాయి. బయట హోటల్లో తిన్న కూరలో ఉండే ఆ ప్రత్యేకమైన రుచి… ఫ్రైడ్ రైస్ నుంచి మ్యాగీ వరకు అన్నింటికీ వచ్చే ఆ మసాలా ఫ్లేవర్… చాలా మందిని ఆకట్టుకుంటుంది. అందుకే మార్కెట్లో దొరికే మ్యాగీ మసాలాలను చాలామంది వంటల్లో కూడా ఉపయోగిస్తుంటారు. కానీ ప్రతిసారి బయట మసాలాలు కొనడం ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశమూ ఉంటుంది. అయితే ఇప్పుడు అదే మ్యాజిక్ టేస్ట్‌ను ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
ఇంట్లో ఉండే సాధారణ మసాలా దినుసులతో తయారయ్యే ఈ హోమ్మేడ్ మ్యాగీ మసాలా ఒక్కసారి సిద్ధమైతే, ప్రతి వంటకానికి కొత్త రుచిని ఇస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో గంటల తరబడి వంటగదిలో నిలబడాలనిపించని సమయంలో, ఈ ఒక మసాలా పొడి ఉంటే సాధారణ కూర కూడా స్పెషల్ డిష్‌లా మారిపోతుంది. మ్యాగీ, ఫ్రైడ్ రైస్, ఆలూ ఫ్రై, డ్రై కర్రీలు, గ్రేవీ కూరలు ఇలా ఏ వంటలో వేసినా హోటల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది.
Also Read
- Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
- Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
- Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా 'హై ఫ్యాట్, షుగర్, సాల్ట్' హెచ్చరికలు..
- Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
ఈ మసాలా తయారీలో ఉపయోగించే పదార్థాలు కూడా చాలా సాధారణమే. ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, దాల్చినచెక్క వంటి సుగంధ దినుసులతోనే దీనిని చేసుకోవచ్చు. వీటిని ముందుగా పొడిగా వేయించాలి. అలా వేయించడంతో వాటి సహజ సువాసన బయటకు వచ్చి మసాలాకు ప్రత్యేకమైన ఫ్లేవర్ ఇస్తుంది. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, ఆమ్చూర్ పొడి, కొద్దిగా కార్న్‌ఫ్లోర్, ఉప్పు, చక్కెర కలిపి మరోసారి బ్లెండ్ చేస్తే చాలు. బయట కొనుగోలు చేసే మ్యాగీ మసాలాకు ఏమాత్రం తీసిపోని రుచి సిద్ధమవుతుంది.
ఈ మసాలాలో ఉండే సోంపు, ధనియాలు వంటకు మంచి వాసన ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. దాల్చినచెక్క, లవంగాలు వంటకు వేడి రుచి తీసుకురాగా, ఆమ్చూర్ పొడి తేలిక పాటి పులుపుతో ప్రత్యేకమైన టేస్ట్ ఇస్తుంది. అందుకే ఈ మసాలా కలిపిన తర్వాత వేరే గరం మసాలా అవసరం కూడా ఉండదు.
తయారైన ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేస్తే చాలా నెలల పాటు తాజాగా ఉంటుంది. ప్రతిసారి కూర వండేటప్పుడు కేవలం ఒక టీ స్పూన్ చాలు. సాధారణంగా చేసే ఆలూ ఫ్రై కూడా రెస్టారెంట్లో తిన్నట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే మ్యాగీ, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి వంటకాల్లో ఈ మసాలా వేసితే రుచి మరింత పెరుగుతుంది.
ఇంట్లో తయారుచేసుకునే మసాలాల ప్రత్యేకత ఏమిటంటే… వాటిలో ఏమేం కలుపుతున్నామో మనకే తెలుసు. కృత్రిమ రంగులు, అధిక సోడియం, ప్రిజర్వేటివ్స్ భయం ఉండదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల పాటు ఉపయోగించుకునే ఈ హోమ్మేడ్ మ్యాగీ మసాలా ఇప్పుడు చాలా ఇళ్లలో కిచెన్ సీక్రెట్‌గా మారుతోంది.
- Tags
- Kitchen Tips
- Maggi Masala
తాజావార్తలు
-
Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
-
Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
-
Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
-
Ramayana : ‘రామాయణ’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
ట్రెండింగ్
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!