Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
- ఉప్మా రవ్వతో కరకరలాడే ఈజీ స్నాక్ రెడీ
- టీ టైమ్‌కు పర్ఫెక్ట్.. పిల్లలకు కూడా ఫేవరెట్
- తక్కువ ఖర్చుతో వారం రోజులు నిల్వ ఉండే రుచికరమైన స్నాక్
- స్నాక్స్ విడిపోకుండా ఉండేందుకు సింపుల్ కిచెన్ టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Suji Snacks Recipe in Telugu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బియ్యపు పిండి లేదా మైదాతో జంతికలు, చెక్కలు చేసుకుంటాం. కానీ ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో కూడా చాలా రుచికరమైన, క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ‘రవ్వ స్నాక్స్’ పిల్లలకు స్నాక్ బాక్స్‌లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. వీటి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
ఉప్మా రవ్వ (సుజీ): 1 ½ కప్పు
నీళ్లు: 1 కప్పు
నెయ్యి లేదా నూనె: 2 టేబుల్ స్పూన్లు
వాము, జీలకర్ర: అర టీస్పూన్ చొప్పున
నువ్వులు: 1 టీస్పూన్
కసూరి మేతి: 1 టీస్పూన్ (నలిపి వేయాలి)
చిల్లీ ఫ్లేక్స్: 1 టీస్పూన్ (లేదా కారం)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
1. నీటిని మరిగించడం:
ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు వేడెక్కుతున్నప్పుడు అందులో నెయ్యి, వాము, జీలకర్ర, నువ్వులు, కసూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్ , రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి నీటిని మరగనివ్వాలి.
2. రవ్వ మిశ్రమం తయారీ:
నీళ్లు మరుగుతున్నప్పుడు, మంటను తగ్గించి అందులో ఒకటిన్నర కప్పు ఉప్మా రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలపాలి. రవ్వ నీటిని పీల్చుకున్న వెంటనే స్టవ్ ఆపేయాలి. దీనిపై మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద మగ్గనివ్వాలి.
3. పిండిని కలపడం:
రవ్వ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్‌లోకి తీసుకుని చేత్తో బాగా ఒత్తుతూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీటి తడి చేసుకుని సాఫ్ట్‌గా చేసుకోవచ్చు. పిండిని ఎంత బాగా కలిపితే స్నాక్స్ అంత బాగా వస్తాయి, లేదంటే నూనెలో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది.
4. ఆకృతి ఇవ్వడం:
కలుపుకున్న పిండిని పెద్ద ముద్దలుగా చేసుకుని, చపాతీ పీటపై మీడియం మందంగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మూత లేదా గిన్నె సహాయంతో గుండ్రటి బిళ్లల్లా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఇతర ఆకృతుల్లో కూడా వీటిని కట్ చేసుకోవచ్చు.
5. డీప్ ఫ్రై చేయడం:
బాండీలో నూనెను బాగా వేడి చేయాలి. నూనె సరిగ్గా కాగకుండా వీటిని వేస్తే విడిపోతాయి, కాబట్టి హై ఫ్లేమ్‌లో నూనె కాగాక మాత్రమే ముక్కలను వేయాలి. వేసిన తర్వాత మంటను అడ్జస్ట్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి.
ముఖ్యమైన చిట్కాలు:
ఒకవేళ నూనెలో వేసినప్పుడు బిళ్లలు విడిపోతుంటే, పిండిలో ఒక చెంచా బియ్యపు పిండి లేదా మైదా కలిపి తిరిగి ట్రై చేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో భద్రపరుచుకుంటే వారం రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి. ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ రవ్వ స్నాక్స్‌ను మీరు కూడా ట్రై చేసి చూడండి..!
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?