Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chilli Garlic Egg Salad Recipe: ఆరోగ్యకరమైన అల్పాహారం రోజంతా శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ తిని విసుగొచ్చిందా? అయితే రుచితో పాటు పోషకాలు కూడా అందించే చిల్లీ గార్లిక్ ఎగ్ సలాడ్ మీకు మంచి ఎంపిక. గుడ్లు, తాజా కూరగాయలు, పెరుగు, వెల్లుల్లి, ఎండు మిరపకాయలతో తయారయ్యే ఈ సలాడ్ ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
కావలసిన పదార్థాలు
చిల్లీ గార్లిక్ పేస్ట్ కోసం:
* వెల్లుల్లి రెబ్బలు – 8 నుంచి 10
* ఎండు మిరపకాయలు – 3 నుంచి 4
* ఉప్పు – తగినంత
* నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
* నీరు – 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
Also Read
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
సలాడ్ కోసం:
* ఉడికించిన గుడ్లు – 4 లేదా 5
* నూనె – 1 నుంచి 2 టీస్పూన్లు
* పాలకూర లేదా లెట్యూస్ ఆకులు – 1 కప్పు
* తురిమిన క్యారెట్ – అర కప్పు
* సన్నగా తరిగిన టమాటా – 1
* సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
డ్రెస్సింగ్ కోసం:
* పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
* గ్రీక్ యోగర్ట్ – 2 టేబుల్ స్పూన్లు
* చాట్ మసాలా – అర టీస్పూన్
* ఒరేగానో – అర టీస్పూన్
* ఉప్పు – చిటికెడు
తయారీ విధానం
ముందుగా వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసి చిల్లీ గార్లిక్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన గుడ్లను రెండు ముక్కలుగా కోసి, కొద్దిగా నూనెలో లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఒక పెద్ద గిన్నెలో పాలకూర, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో పెరుగు, గ్రీక్ యోగర్ట్, చాట్ మసాలా, ఒరేగానో, ఉప్పు వేసి డ్రెస్సింగ్ సిద్ధం చేయాలి. ఈ డ్రెస్సింగ్‌ను కూరగాయలపై పోసి బాగా కలిపి, పైగా వేయించిన గుడ్లను అమర్చాలి. చివరగా చిల్లీ గార్లిక్ పేస్ట్ వేసి మెల్లగా కలిపి వెంటనే సర్వ్ చేయాలి.
ఈ సలాడ్ ఎందుకు ప్రత్యేకం?
గుడ్లలో ఉండే అధిక ప్రోటీన్, కూరగాయల్లోని ఫైబర్, పెరుగులోని ప్రోబయోటిక్స్ కలిసి శరీరానికి మంచి పోషణ అందిస్తాయి. బరువు నియంత్రించుకోవాలనుకునే వారికి, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారికి, రుచికరమైన ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే వారికి ఈ చిల్లీ గార్లిక్ ఎగ్ సలాడ్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!