health: సాధారణంగా మనం కొన్ని మసాలా కూరల తయారీ లోను, కొన్ని రకాల స్వీట్ తయారీ లోనూ, ఇలా మనం చేసే కొన్ని వంటల్లో ఎండు కొబ్బరిని వాడుతూ ఉంటాం. అయితే ఎండు కొబ్బరిని రోజు తినవచ్చా..? తినకూడదా..? అంటే నిస్సందేహంగా తినవచ్చు. ప్రతి రోజు ఎండు కొబ్బరిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి కొబ్బరిలో ఉన్నట్లే ఎండు కొబ్బరి లోను అనేక రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలానే ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. కనుక రోజు 50 గ్రాల చొప్పున ఎండు కొబ్బరి తినడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లబ్భయిస్తుంది.
Read also:Benefits of Ragi idli : రాగి ఇడ్లీ ఉపయోగాలు.. తయారీ విధానం
అలానే తగు మోతాదులో ఎండు కొబ్బరి తినడం వల్ల గుండె సమస్యలు ధరి చేరవు. ఎండు కొబ్బరిని బెల్లం తో కలిపి ఆహారంగా తీసుకుంటే రక్త హీనత సమస్యను నియంత్రించవచ్చు. సంతాన లేమి సమస్యలు కూడా తరుచూ ఎండు కొబ్బరి తినడం వల్ల తగ్గుతాయి. ఎండు కొబ్బరి తినడం వల్ల కాన్సర్ సంభవించే అవకాశాలు చాల తక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నీరసం ధరి చేరదు. కానీ ఎండు కొబ్బరిని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రోజు కొద్ది మోతాదులో ఎండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెప్తున్నారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.