Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • వేసవిలో బాదం షర్బత్ ప్రాముఖ్యత
  • పోషక విలువలతో శక్తినిచ్చే హెల్తీ డ్రింక్
  • ఇంట్లోనే సులభంగా తయారీ విధానం
  • చల్లగా సర్వ్ చేస్తే రెట్టింపు రుచి
Badam Sharbat

Badam Sharbat

Summer Super Drinks : ఎండలు ముదురుతున్న కొద్దీ శరీరం త్వరగా నీరసించిపోతుంది. ఇలాంటి సమయంలో కేవలం నీళ్లు తాగడం వల్ల దాహం తీరినట్లు అనిపించినా, శరీరానికి కావాల్సిన శక్తి అందదు. అందుకే వేసవిలో చల్లదనంతో పాటు ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే పానీయాల వైపు మొగ్గు చూపడం మంచిది. అలాంటి వాటిలో ‘బాదం షర్బత్’ అత్యంత ఉత్తమమైనది. బాదంలో ఉండే పోషక విలువలు శరీరానికి మేలు చేయడమే కాకుండా, మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ బాదం షర్బత్‌ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే స్వచ్ఛంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Megastar Chiranjeevi : నంది అవార్డులపై AP ప్రభుత్వంపై చిరు కామెంట్స్.. నెటిజన్స్ ట్రోల్స్

కావాల్సిన పదార్థాలు:
ఈ షర్బత్ తయారీకి అర కప్పు బాదం గింజలు, రెండు కప్పుల పంచదార, నాలుగు కప్పుల నీళ్లు , మంచి సువాసన కోసం రెండు టీస్పూన్ల యాలకుల పొడి అవసరమవుతాయి.

CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు..

తయారీ విధానం:
ముందుగా బాదం గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానిన బాదం గింజల పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి, అందులో పంచదార , యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగి, తీగ పాకంలా మారుతున్నప్పుడు స్టవ్ ఆపివేయాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో పొట్టు తీసిన బాదం గింజలను వేసి, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార పాకాన్ని కూడా పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన చిక్కని బాదం మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి భద్రపరుచుకోవాలి. ఇది మీకు కావాల్సినప్పుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.

సర్వ్ చేసే విధానం:
మీరు షర్బత్ తాగాలనుకున్నప్పుడు, ఒక గ్లాసులో తగినంత బాదం మిశ్రమాన్ని వేసి, అందులో చల్లని నీళ్లు , ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బాదం షర్బత్ సిద్ధం! ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వారికి లేదా అతిథులకు ఇది ఒక అద్భుతమైన రిఫ్రెష్ డ్రింక్ లా పనిచేస్తుంది.