NTV Telugu Site icon

Curd: పెరుగును ఈ ఆహారాలతో తింటున్నారా.. జర జాగ్రత్త..!

Curd

Curd

పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. భోజనం చేసేటప్పుడు చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. మలబద్ధకం నయమవుతుంది. పెరుగు తింటే ఎముకల సాంద్రత పెరిగి ఎముకలు దృఢంగా తయారవుతాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది.. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి.. ఆరోగ్యంగా చేస్తుంది. అంతేకాకుండా.. ముఖంపై ఉన్న మొటిమలు, ముడతలను తొలగించడంలో పెరుగు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా.. బరువు అదుపులో ఉంటుంది. పెరుగులో తక్కువ కేలరీలు ఉంటాయి, ఇది చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.

పెరుగు తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి బీపీని సాధారణీకరిస్తాయి. పెరుగును రోజూ తినడం వల్ల అమృతం వంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే.. కొన్నిసార్లు తినేటప్పుడు పెరుగుతో పాటు ఇతర ఆహారాలను కలిపి తింటారు. అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.. ఇంతకీ ఆ ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం.

Bank Jobs: SIDBIలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం

పెరుగుతో ఉల్లిపాయను తినకూడదు:
చాలా తరచుగా ప్రజలు పెరుగు రైతాను తయారు చేస్తారు. అందులో ఉల్లిపాయలు, టమోటాలు కూడా వేస్తారు. కానీ ఉల్లిపాయను పెరుగుతో అస్సలు తినకూడదు. ఉల్లిపాయను పెరుగుతో కలిపి తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. పెరుగు-ఉల్లిపాయల కలయిక అసిడిటీ, వాంతులు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. పెరుగులో రుచి కోసం ఇతర ఆహారాలను తినాలనుకుంటే.. చక్కెర, బెల్లం, తేనె, ఎండుమిర్చి, గరం మసాలా కలపి తినవచ్చు. పెరుగును మజ్జిగ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

పెరుగుతో పండ్లను తినవద్దు:
పెరుగును పండ్లలో కలిపి జ్యూక్స్ తయారు చేస్తారు. అలా చేయడం వల్ల మీ జీర్ణక్రియను పాడు చేస్తుంది. అంతేకాకుండా.. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, అలర్జీ వంటి సమస్యలు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. పెరుగు ఆమ్లంగా ఉంటుంది.. దీనిని పండ్లతో కలిపి తీసుకుంటే.. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, గుండెల్లో మంట వస్తాయి.

చేపలు తిన్న తర్వాత పెరుగు తినొద్దు:
చేపలను తిన్న తర్వాత పెరుగును అస్సలు తినొద్దు. చేపలు, పెరుగులో రెండూ అద్భుతమైన ప్రోటీన్లు ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరానికి విషపూరితం అవుతుంది. అలా ఈ రెండు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

పెరుగుతో ఖర్జూరాన్ని తినవద్దు:
పెరుగుతో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెరుగు తింటే శరీరం చల్లగా ఉంటుంది. దీంతో.. కఫం, వాతాన్ని పెంచుతుంది. ఖర్జూరం వేడిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇవి రెండు అపోజిట్….

Show comments