పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. అన్నంలో చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.