Fig Water Benefits: అంజీర (Fig) పోషకాలు సమృద్ధిగా కలిగిన పొడి పండ్లు. వీటిలో విటమిన్ C, K, B6, ఫోలిక్ యాసిడ్‌తో పాటు పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు లభిస్తాయి. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. శరీరానికి అవసరమైన శక్తినీ ఇస్తాయి.
అయితే, ప్రతిరోజూ అంజీర నీరు తాగడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది. మరి ఈ అంజీర నీటిని ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలేమిటో చూద్దాం. ఇందుకోసం మొదటగా 2-3 అత్తి కాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి. వాటిని ఒక గ్లాస్ శుభ్రమైన నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం వాటిని వడగట్టి సగం టీస్పూన్ తేనె కలిపి తాగాలి. రుచికి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
Tadipatri: జేసీ vs కాకర్ల.. గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ!
ఇలా అంజీర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. అంజీరలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు మేలు చేస్తుంది. అలాగే వీటిలో లభించే ద్రావణీయ ఫైబర్ పేగులను డీటాక్స్ చేస్తుంది. దీంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇకపోతే అంజీరలో ఉండే ఐరన్, మాగ్నీషియం, జింక్, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రిప్రొడక్టివ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఈ నీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. దీని వలన ఎక్కువసేపు ఆకలి వేయదు. తరచూ తినాలనిపించకపోవడంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Man Kills Wives: బిహార్‌లో దారుణం.. ముగ్గురిని పెళ్లాడి.. ఇద్దరిని చంపేశాడు..
అంజీరలో ఉండే పాలీఫీనాల్స్ శరీరంలో స్ట్రెస్ తగ్గించడంలో, హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీంతో చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది. వీటితోపాటు కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అంజీరలో లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా, బలంగా ఉంచుతాయి. మొత్తంగా, ప్రతిరోజూ ఉదయాన్నే అంజీర నీరు తాగడం శరీరానికి పలు విధాలుగా మేలు చేస్తుంది. ప్రత్యేకంగా డయాబెటిస్ నియంత్రణలో, జీర్ణక్రియ మెరుగుదలలో, చర్మం, ఎముకల ఆరోగ్యంలో మంచి ప్రయోజనం కలుగుతుంది.