NTV Telugu Site icon

Excessive Sleep: అతిగా నిద్ర పోతున్నారా? మీకు ఈ సమస్యలు తప్పవు..

Sleeping

Sleeping

మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. అయితే.. నిద్ర లేకపోవడం వల్ల మాత్రమే సమస్యలు రావు. ఎక్కువగా నిద్ర పోయినా కూడా ప్రమాదమేనట. కొందిరి ఇలా నిద్రలేమి సమస్య వెంటాడితే.. మరి కొందరికి ఎక్కువగా నిద్రించే అలవాటు ఉంటుంది. కానీ.. ఎక్కువ గంటలు నిద్రిస్తే చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. రాత్రుల్లో ఎక్కువగా నిద్రిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయొ ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: AP Crime: బాలికను 3 రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్..

అతిగా నిద్రపోయే వారిలో ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు. తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారిలో 49 శాతం డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎక్కువ సేపు నిద్రపోతే మెదడు పని తీరు దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు నిద్రపోయే ఆడవారు.. గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. 650 మంది ఆడవారిపై నిర్వహించిన టెస్టుల్లో ఇది తేలింది. రోజుకు 9 లేదా 11 గంటలు నిద్రపోయే మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. నిద్ర ఎక్కువ అయినా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రాత్రి పూట 10 గంటలకు పైగా నిద్రపోయే వ్యక్తుల్లో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయట. 9 నుంచి 10 గంటలు నిద్రపోయే వారిలో.. ఆహార నియంత్రణ, వ్యాయామం చేసినప్పటికీ 25 శాతం బరువు పెరిగినట్టు నిపుణులు కనుగొన్నారు.

READ MORE: Akhilesh Yadav: ఔరంగజేబు సమాధిపై వివాదం.. అఖిలేష్ యాదవ్ రియాక్షన్ ఇదే..