మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.