Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే ‘మిల్ మేకర్ మంచూరియా’.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soya Manchurian: సాయంత్రం కాగానే వేడివేడిగా, కాస్త ఘాటుగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే అందరికీ గుర్తొచ్చేది మంచూరియా. అయితే హోటల్స్, రోడ్‌సైడ్ బండ్ల మీద దొరికే క్యాబేజీ మంచూరియా కంటే ఎంతో హెల్తీగా, కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ‘సోయా మంచూరియా’ (Soy Manchurian) సిద్ధం చేసుకోవచ్చని మీకు తెలుసా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా, కేవలం మిల్ మేకర్స్ ఉంటే చాలు.. పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తినే ఈ స్టార్టర్ రెసిపీని ఎలా చేయాలో ఈ స్పె్షల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
మిల్ మేకర్స్ (సోయా చక్స్) – 1 కప్పు
Also Read
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1/2 స్పూన్
మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) – 2 టేబుల్ స్పూన్లు + 1 టీస్పూన్ (గ్రేవీ కోసం)
సెజ్వాన్ సాస్ – 2 టీస్పూన్లు
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్ – 2 టీస్పూన్లు
వెనిగర్ – 1 టీస్పూన్
మిరియాల పొడి – 1/2 స్పూన్
సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు – 1 టీస్పూన్ చొప్పున
పచ్చిమిర్చి – 2 (నిలువుగా చీల్చినవి)
ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లికాడలు – తగినంత
ఉప్పు, నూనె – రుచికి తగినంత
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో రెండు మూడు కప్పుల నీటిని పోసి, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు మిల్ మేకర్స్ వేసి కేవలం రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి వాటిని వడకట్టి, చల్లటి నీళ్లలో వేసి.. తడి లేకుండా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి పెట్టుకున్న మిల్ మేకర్స్‌లో తగినంత ఉప్పు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ సెజ్వాన్ సాస్, ఒక టీస్పూన్ సోయా సాస్ వేసి బాగా కలపాలి. బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల మైదా, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ముక్కలకు పట్టేలా పొడిపొడిగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు.
కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి, మిల్ మేకర్లను విడివిడిగా వేస్తూ మీడియం ఫ్లేమ్‌పై మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ – క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. (ఇలా వేయించిన వాటిని నేరుగా సాస్‌లతో కూడా తినేయవచ్చు). ఇప్పుడు మరొక పాన్‌లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు (లేదా ఉల్లికాడలు) వేసి కాస్త ఫ్రై చేయాలి. ఆ తర్వాత అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు (సాస్‌లలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి) వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ సెజ్వాన్ సాస్, రెండు టేబుల్ స్పూన్ల టొమాటో సాస్, ఒక టీస్పూన్ సోయా సాస్, ఒక టీస్పూన్ వెనిగర్ వేసి లో-ఫ్లేమ్‌లో కలపాలి. ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్, పావు కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి.. ఆ మిశ్రమాన్ని పాన్‌లో పోసి ఉడికించాలి. గ్రేవీ కాస్త చిక్కబడి సిల్కీ టెక్స్చర్ వచ్చేవరకు కలపాలి. గ్రేవీ తయారైన తర్వాత.. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్, పైనుంచి కొద్దిగా ఉల్లికాడల తరుగు వేసి సాస్ అంతా ముక్కలకు పట్టేలా హై ఫ్లేమ్‌పై ఒక నిమిషం పాటు బాగా టాస్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, హాట్ అండ్ స్పైసీ సోయా మంచూరియా రెడీ అవుతుంది. వర్షం పడుతున్నప్పుడైనా లేదా సాయంత్రం స్నాక్ లాగానైనా వేడివేడిగా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
శాఖాహారులకు మిల్ మేకర్స్ ఒక వరప్రసాదం. చికెన్, గుడ్లతో సమానంగా.. లేదా వాటికంటే ఎక్కువగా ఇందులో ప్రోటీన్లు లభిస్తాయి. ఇది కండరాల పుష్టికి, శారీరక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. అలాగే మిల్ మేకర్స్‌లో ఐరన్ (ఇనుము) కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది, ఎనీమియా లేదా రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. సోయా చక్స్లో కొలెస్ట్రాల్ – శాచురేటెడ్ ఫ్యాట్స్ అస్సలు ఉండవు. పైగా ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) – ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల, దీనిని తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపించి ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇది అనవసరపు ఈటింగ్ అలవాట్లను తగ్గించి బరువు అదుపులో ఉండేలా చేస్తుంది. సోయాలో కాల్షియం – ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే ఎముకల బలహీనతను నివారించి, ఎముకలను దృఢంగా మారుస్తాయి. మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను, ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ – హాట్ ఫ్లాషెస్ వంటి సమస్యలను తగ్గించడంలో సోయా ఉత్పత్తులు చక్కగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!