Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత ‘మా ఇంటి బంగారంతో’ బిజీ, కాజల్, తమన్నా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ మెయింటైన్ చేస్తున్నారు. మరి నిత్యా మీనన్ సంగతి ఏంటి? ఆ మధ్య నిర్మాతగా మారుతున్నట్లు అనౌన్స్ చేసింది, కానీ ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేదు. నటిగా తన నెక్స్ట్ మూవీ ఏంటో అప్డేట్ లేదు. నిత్య ఏం చేస్తున్నట్లు? అయితే నిత్య మీనన్, లాస్ట్ ఇయర్ ‘తలైవన్ తలైవి’, ‘ఇడ్లీ కడై’ డబ్బింగ్ సినిమాలతో హాయ్ చెప్పిన ఈ బాలీవుడ్ కుట్టి, ఆ తర్వాత కొత్త సినిమా కబురు వినిపించలేదు. ఆ మధ్య ‘కేయూరి ప్రొడక్షన్స్’ అనే సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా మారుతున్నట్లు అనౌన్స్ చేసింది, కానీ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన దాఖలాలు లేవు. నటిగానూ ఏ సినిమా చేస్తుందో అప్డేట్ లేదు.
నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో న్యూ స్టెప్ తీసుకోబోతుంది నిత్య. 24 క్రాఫ్ట్స్ లోని కీలక విభాగమైన దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతుందట. ఈ విషయాన్ని ‘తలైవన్ తలైవి’ డైరెక్టర్ పాండిరాజ్ రివీల్ చేశాడు. నిత్య గుడ్ రైటర్ అంటూ పొగిడేసిన డైరెక్టర్, ఆల్రెడీ రెండు స్క్రిప్ట్స్ కంప్లీట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమెకు డైరెక్టర్ కావాలని కోరిక ఉందని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది నిత్యా మీనన్.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తెలుగులో సరైన స్క్రిప్ట్ రాకపోవడం వల్ల గ్యాప్ తీసుకున్న నిత్యా మీనన్, తమిళంలో ఓ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న నిత్య, ప్రాఫిట్ షేర్ విధానంలో పేమెంట్ తీసుకుంటుందన్న టాక్ నడుస్తోంది. నిత్య నెక్స్ట్ నటిగా కనిపిస్తుందో, నిర్మాతగా మారబోతుందో, దర్శకురాలి అవతారం ఎత్తబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!