Why Dogs Attack Humans: శునకాలు అంటేనే విశ్వాసానికి ప్రతిరూపమైన జంతువు అంటాం. ఇవి ఇంటిని, మనల్ని దొంగల నుంచి ఆపద సమయాల్లో రక్షిస్తాయని భావిస్తాం. కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. రక్తం రుచి మరిగినట్లుగా మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల స్వైరవిహారం ఆగడం లేదు. నిత్యం ఏదో ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కుక్కల దాడిలో మరణిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వీధికుక్కల టాపిక్ చాలా రోజులు చర్చనీయాంశంగా మారింది. జంతు ప్రేమికులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో కోర్టు తీర్పును మార్చుకుంది. ఇదిలా ఉండగా.. అసలు వీధి కుక్కలు ఎందుకు మనుషులను టార్గెట్ చేస్తాయి? ఎందుకు వెంట పడతాయి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: INS Aravali: INS ఆరావలి.. హిందూ మహాసముద్రంపై భారత్ నిఘా నేత్రం
కుక్కలు మనుషులపై దాడి చేయడానికి వాటిలోనున్న అభద్రతాభావమే కారణమని నిపుణులు, పశు వైద్యులు చెబుతున్నారు. ప్రతీ కుక్క కొంతప్రాంతాన్ని తన అడ్డాగా భావిస్తుంది. ఇప్పుడు వాటి సంతతి కూడా వేగంగా పెరుగుతోంది. మరోవైపు మానవ జనాభా కూడా పెరిగిపోతోంది. దీంతో కుక్కల విస్తృతి ప్రదేశం తగ్గిపోతోంది. దీంతో వాటిలో అభద్రతాభావం నెలకొంటోంది. మనుషులు తమ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారని భావిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి. కొన్నిసార్లు ప్రజల్ని భయపెట్టడం కూడా కుక్కలు ఒక ఆటలా చూస్తాయి. అవి వెంటపడినప్పుడు ప్రజలు పరుగుపెడతారు. అది చూసి మానవులు తమకు భయపడుతున్నారని వాటికి అర్ధమవుతుంది. ఈ క్రమంలో అవి ఒక్కోసారి మనుషులపై దాడిచేసి కరుస్తాయని నిపుణులు తెలిపారు.
READ MORE: 6000mAh బ్యాటరీ, అధునాత AI ఫీచర్లు, IP65 రెసిస్టెన్స్‌తో Itel Super 26 Ultra స్మార్ట్ ఫోన్ లాంచ్!
ఈ జాగ్రత్తలు పాటించండి..
కుక్కల కళ్లలోకి చూడకూడదు. అలా చేస్తే రెచ్చగొట్టినట్లుగా అవి భావిస్తాయి. పెంపుడు శునకాలు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే ప్రవర్తిస్తాయి. కుక్కలు తినే సమయంలో కదలించకూడదు. నోటి నుంచి లాలాజలం వస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. కోపంతో ఉన్నప్పుడు కుక్కలు పళ్లు బయటపెడతాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. నీడ దొరక్క.. చీకాకుతో ఉన్నప్పుడు కదలిస్తే మరింత రెచ్చిపోతాయి.
ఆగస్టు-సెప్టెంబరు, ఫిబ్రవరి-మార్చి నెలల్లో కుక్కల గర్భధారణలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వాటి జోలికి వెళ్లొద్దు. కుక్క దగ్గరికి వస్తుంటే పరిగెత్తకుండా నిలబడి ఉంటే… చాలావరకు మౌనంగా వెళ్లిపోయే అవకాశం ఉంది. కుక్కలు పోట్లాడుకునే సమయంలో అటుగా వెళ్లకుండా ఉంటే మంచిది. కుక్కను దగ్గరికి తీసుకునే క్రమంలో వీపు మాత్రమే నిమరాలి.