Diabates Food Diet: డయాబెటిస్ రోగులు తినకూడని ఫుడ్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత దశాబ్ద కాలంగా దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలోని అన్ని నగరాలు డయాబెటిస్ రోగులతో నిండిపోతున్నాయి. పెరుగుతున్న వయస్సు, కుటుంబ చరిత్ర మధుమేహం వ్యాధి వ్యాప్తిని పెంచుతుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కూడా ఈ వ్యాధి పెరుగుదలకు దారితీస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ దైనందిన జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే, రక్తంలో చక్కెర శాతం అకస్మాత్తుగా పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు ఈ ఆహారం తినకుండా ఉంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
డయాబెటిస్ రోగులు ప్రతిరోజు క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. ఎక్కువసేపు కడుపుని ఖాళీగా ఉంచకూడదు. అందుకే మధుమేహంతో బాధపడేవారికి అల్పాహారం చాలా ముఖ్యం. ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన అనేక అధ్యయనాలు అల్పాహారం మానేసిన వ్యక్తులు ఈ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. రాత్రి పడుకోవడానికి మరియు ఉదయం భోజనం తర్వాత నిద్ర లేవడానికి మధ్య ఎనిమిది నుండి పది గంటల గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. కాబట్టి డయాబెటిస్ రోగులు బ్రేక్ ఫాస్ట్ ఎంత త్వరగా తింటే అంత మంచిది.
Also Read
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
Read Also: Good Food For Summer: వేసవిలో ఈ ఫుడ్స్ తింటే త్వరగా అలసిపోరు
చాలా మంది భారతీయులు వైట్ బ్రెడ్ ను అల్పాహారంగా తింటారు, ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. శుద్ధి చేసిన పిండి పదార్థాలు రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వాటి వినియోగం మధుమేహంలో చాలా హానికరం. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్ని రకాల రిఫైన్డ్ కార్బోహైడ్రేట్‌లకు దూరంగా ఉండటం మంచిది. లేకుంటే వాటి వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతుంది. మీకు కూడా అల్పాహారంగా వైట్ బ్రెడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. బిస్కెట్లు, పాస్తా, స్వీట్లు, కేకులు, పేస్టీలు, బియ్యం, ఎనర్జీ డ్రింక్స్ లలో కూడా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఉంటాయి.
డయాబెటిక్ రోగులు ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ సేపు కూర్చోవడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇంట్లో లేదా ఆఫీసులో ఎప్పుడూ కూర్చునే అలవాటు మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఎక్కువసేపు కూర్చునేవారికి టైప్ 2 మధుమేహం వచ్చే వ్యక్తుల ప్రమాదాన్ని 31 శాతం పెంచుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మధుమేహం రాకూడదనుకుంటే, ఒకే చోట నిరంతరం కూర్చుని పని చేయకూడదు. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. పగటిపూట తేలికపాటి వ్యాయామం చేయాలి. నడకకు మించిన వ్యాయామం లేదు. కాబట్టి రోజూ కాస్త దూరం నడవండి. తక్కువ దూరం ఉండే ప్రాంతాలకు టూవీలర్లు వాడే అలవాటుంటే వెంటనే ఆపేయండి.
అంతేకాకుండా పదిమంది మధ్య ఉండడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, ఉల్లాసంగా ఉండడం మంచిది. ఒంటరితనం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని కనుగొంది. ఒక జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ఇతర వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు లేనందున ఒంటరిగా నివసించే వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. \\
Read Also: Transgender Lawyer: కేరళలో ఫస్ట్ ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!