Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
- పొడిపొడిగా అన్నం కోసం సింపుల్ కిచెన్ ట్రిక్
- నిమ్మరసం, నెయ్యితో అదిరే ఫలితం
- నీటి కొలత, విజిల్స్‌లోనే అసలు సీక్రెట్
- ఈ చిన్న తప్పులే అన్నాన్ని ముద్ద చేస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips : మధ్యాహ్నమైనా, రాత్రి వేళయినా వేడివేడి అన్నాన్ని సాంబార్ లేదా నచ్చిన కూరలతో కలిపి తింటే ఆ తృప్తే వేరు. కానీ కొన్నిసార్లు ప్రెషర్ కుక్కర్లో హడావిడిగా అన్నం వండినప్పుడు, అది జిగటగా మారి ముద్దలా తయారవుతుంది. వండే ముందు బియ్యాన్ని సరిగ్గా కడగకపోవడం, నీటి కొలత సరిగ్గా లేకపోవడం, , బియ్యంలోని పిండిపదార్థం (స్టార్చ్) ఒకదానికొకటి అంటుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే కొన్ని చిన్న వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా కుక్కర్లో వండినా సరే అన్నాన్ని మల్లెపూవులా పొడిపొడిగా, సువాసనభరితంగా తయారు చేసుకోవచ్చు.
బియ్యం విడివిడిగా రావడానికి ‘సీక్రెట్’ పదార్థాలు
అన్నం గింజలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండటానికి వంటింట్లో ఉండే నిమ్మరసం, నెయ్యి లేదా నూనె అద్భుతంగా సహాయపడతాయి. అన్నం వండే ముందు నీటిలో రెండు టీస్పూన్ల నిమ్మరసం లేదా ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి కలపడం వల్ల బియ్యపు గింజలన్నీ విడివిడిగా వస్తాయి. ఇందులో నిమ్మరసం బియ్యంలోని జిగురు స్వభావాన్ని తగ్గించి గింజలు అతుక్కోకుండా చూస్తే, నెయ్యి లేదా నూనె అన్నానికి మంచి మెరుపును , అద్భుతమైన సువాసనను అందిస్తాయి.
Also Read
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
- Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
- How To Make Diya Without Oil: దీపావళికి ఖరీదైన దీపాలు వద్దు.. ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ తయారు చేయండిలా..
పర్ఫెక్ట్ అన్నం కోసం తయారీ విధానం
ఈ విధానం కోసం ముందుగా బియ్యంలోని అదనపు పిండిపదార్థాన్ని తొలగించడానికి వాటిని శుభ్రమైన నీటితో రెండు నుండి మూడు సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత కడిగిన బియ్యాన్ని కుక్కర్లో వేసి, సాధారణంగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీటి చొప్పున కొలత ప్రకారం నీళ్లు పోయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టే ముందు ఆ నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా అర టీస్పూన్ దేశీ నెయ్యి వేసి చెంచాతో తేలికగా కలపాలి. ఆపై కుక్కర్ మూతను మూసి, అన్నం సమానంగా ఉడకడానికి , కుక్కర్ అడుగున అంటుకోకుండా ఉండటానికి ఎల్లప్పుడూ మధ్యస్థ మంట మీద 1 నుండి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
విజిల్ వచ్చాక చేయకూడని తప్పులు , జాగ్రత్తలు
కుక్కర్ విజిల్స్ రావడం పూర్తి కాగానే చాలా మంది వెంటనే బలవంతంగా ఆవిరి తీసేసి మూత తెరుస్తుంటారు, కానీ ఏ కారణం చేత కూడా అలా చేయకూడదు. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ దానంతట అదే పూర్తిగా తగ్గే వరకు కాసేపు అలాగే వదిలేయాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తెరిచినప్పుడు లోపలి ఆవిరితో అన్నం చక్కగా సెట్ అయి, పొడిపొడిగా అద్భుతమైన రుచితో సిద్ధంగా ఉంటుంది. అలాగే అన్నం ముద్ద కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే కొత్త బియ్యం కంటే కొంచెం పాత బియ్యాన్ని ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది.
తాజావార్తలు
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!