Health Tips: రోజంతా హడావిడిగా గడిపిన కనీసం నిద్రపోయే సమయంలోనైనా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం బయటికి వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే రోజుల్లో మీకోసం, మీ ఆరోగ్యం కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు. మీకు తెలుసా రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. ఇంతకీ ఏంటా పనులు.. అవి చేస్తే ఆరోగ్యానికి కలిగే మంచి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Mirai : మిరాయ్ టికెట్ ధరల పెంపుపై తేజసజ్జా గుడ్ న్యూస్..
డయాబెటిక్ రోగులకు ఉపశమనం..
రాత్రి పడుకునే ముందు డయాబెటిక్ రోగులకు దాల్చిన చెక్కపాలు తాగితే వారి శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సూపర్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో డయాబెటిక్ రోగులకు ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని, ఇవి మధుమేహ నివారణకు సహాయపడుతుందని పేర్కొన్నారు. దాల్చిన చెక్కను పాలలో కలిపినప్పుడు, దానికి రెట్టింపు పోషకాలు లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిదని, ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. పాలు, దాల్చిన చెక్కలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడంలో దోహదం చేస్తుందని చెబుతున్నారు.
ప్రతిరోజూ దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల నెలలోపు మీ ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు పాలలో కలిపి తాగితే బొడ్డు కొవ్వు సులభంగా కరిగిపోతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ పాలు తాగితే మంచి నిద్ర కూడా పడుతుందని అంటున్నారు. దాల్చిన చెక్కపొడి కలిపిన పాలలో బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్, లైకోపీన్, లుటిన్ కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ మిశ్రమంలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని అంటున్నారు. దాల్చిన చెక్క పాలు తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగికి చక్కెర పెరగదని, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క సహజంగా మీ జీవక్రియను కూడా పెంచుతుందని, దాల్చిన చెక్క పాలు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, కణజాల నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాలు, దాల్చిన చెక్క బాగా పని చేస్తాయని చెబుతున్నారు.
READ ALSO: Nepal Protest: నేపాల్ రక్తపాతం.. దేశ హోం మంత్రి రాజీనామా..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.