మన హడావిడి లైఫ్ స్టయిల్, వ్యాయామం లేకపోవడం, అదే పనిగా ఒకేచోట కూర్చోవడం కారణంగా కొన్ని రకాల ఆరోగ్యకరమయిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్నవయసులోనే వెన్నునొప్పి చాలామందిని వేధిస్తూ వుంటుంది. వెన్నునొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
45 సంవత్సరాలకంటే తక్కువ వయస్సుగల వారిలో దీర్ఘకాల అస్వస్థతలలో మొదటిది, 45 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువగా వచ్చే నొప్పుల్లో మూడవది వెన్నునొప్పి అని డాక్టర్లు చెబుతున్నారు. బాధితులు ఉపశమనం కోసం ఏడాదికి వేలాది రూపాయలు ఖర్చుచేస్తుంటారు.
వెన్ను సమస్యలకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రోగులు కొద్దిపాటి వెన్ను నొప్పితో బాధపడ్డారు. మన జీవితాల్లో హుషారుగా ఉన్న సమయాల్లో మనలో 80 శాతం మంది వెన్ను నొప్పితో బాధపడినట్టు చెబుతున్నవారే. నిరంతరం కష్టపడే శ్రామికులకు, కార్యాలయాల్లో పనిచేసేవారికి కూడా నడుం నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
పురుషులు, స్త్రీలు, యువతీయువకులు, వృద్ధులు కూడా ఈ నొప్పికి గురవుతూ వుంటారు. ఆ నొప్పి పునరావృతమవ్వడం, తగ్గక పోవడం జరిగినప్పుడు దాని ప్రభావం కుటుంబంపై, వృత్తిగత జీవితంపై పడుతుంది.
వెన్నునొప్పి రావడానికి అనేక కారణాలు చెప్పవచ్చు. తదేకంగా వచ్చే వెన్ను నొప్పి అనేక లోలోపలి వ్యాధులకు సూచనలుగా చెప్పవచ్చు. యౌవన మరియు మధ్య వయస్సుగల పెద్దవారికి కలిగే వెన్ను నొప్పులకు వారి జీవనశైలి కారణంగా చెప్పవచ్చు. కండరాలు జారడం వల్ల కూడా నొప్పి వస్తుంటుంది.
వెన్నునొప్పి బాధించకుండా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బరువులు గబాలున ఎత్తడం మానండి. నడుమును వంచే బదులు, మోకాళ్లను వంచండి. బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు ఎవరి సాయం అయినా కోరాలి. ఎక్కువ బ్యాగులను మోసేటప్పుడు, బరువును రెండు వైపులకు సమతూకంగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. ఒకే బరువైన వస్తువును మోస్తుంటే, రెండు చేతులతో, శరీరానికి దగ్గరగా ముందుకు పట్టుకోండి. బరువును ఒకేసారి ఎక్కువ దూరం కాకుండా మార్చి మార్చి ముందుకు సాగండి,
ప్రయాణాలకు వెళ్ళేవారు తక్కువ బరువున్న లగేజీని ఉపయోగించాలి. ఇల్లు తుడిచేటప్పుడు, పొడవు చీపురును ఉపయోగించండి. సామానుల క్రింద తుడిచేటప్పుడు నడుమును వంచే బదులు, మోకాలు చిప్పలను ఉపయోగించండి. మోకాలిని నేలకు ఆనించి తుడవడం వల్ల బరువు నడుముపై పడకుండా వుంటుంది.
ఆఫీసు పని చేసేటప్పుడు, ఎప్పుడూ బల్లవద్దనే కూర్చోకుండా, అప్పుడప్పుడూ అటూ ఇటూ నడవడం చేయండి. రోజుకు కనీసం 10 నుండి 15 నిమిషాలైనా నడుముకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. మీరు రోజంతా ఎత్తు చెప్పులను వేసుకోవలసి ఉంటే, వీలైనప్పుడు ఎత్తు చెప్పులకు బదులు ఎక్కువ సౌకర్యంగా ఉండే చెప్పులను తొడుక్కోండి. మహానారాయణ ఆయిల్, కర్పూరాది ఆయిల్, ధన్వంతరం ఆయిల్, అశ్వగంధ ఆయిల్ వంటి వాటిని నొప్పి వచ్చే ప్రాంతాల్లో మర్దన చేయండి. కర్పూరం నొప్పిని తగ్గించే గుణం కలిగి వుంటుంది. ఎక్కువగా ట్యాబెట్లు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.