Chicken Liver vs Mutton Liver: చికెన్ , మటన్ రెండింటి లివర్లలో దేనితో లాభాలున్నాయో తెలుసా..
- లివర్లలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ A, విటమిన్ B12 వంటి పోషకాలు
- రక్తహీనత ఉన్నవారికి లివర్ ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికెన్ లివర్, మటన్ లివర్ రెండూ అధిక పోషక విలువలు కలిగిన ఆహారాలు. సాధారణంగా నాన్ వెజ్ ప్రేమికులు వారానికి కనీసం ఒక్కసారైనా చికెన్, మటన్ లేదా చేపలను ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పోషకాల పరంగా మరింత సమృద్ధిగా ఉండే చికెన్ లివర్, మటన్ లివర్‌లను ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ రెండింటిలోనూ ప్రోటీన్, ఐరన్, విటమిన్ A, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండటంతో శరీరానికి మంచి శక్తిని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తహీనత (అనీమియా) సమస్య ఉన్నవారికి లివర్ ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీర్ణశక్తి వంటి అంశాలను బట్టి సరైన లివర్‌ను ఎంపిక చేసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణుల సూచిస్తున్నారు.
Also Read
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
చికెన్ లివర్ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఐరన్, సెలీనియం, విటమిన్ A, విటమిన్ B12, ఫోలేట్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. చికెన్ లివర్‌లో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ A మరియు విటమిన్ B12 కంటి ఆరోగ్యం, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపకరిస్తుంది. ఉడికించిన చికెన్ లివర్‌ను పరిమిత మోతాదులో తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
చాలా మంది చికెన్ లివర్ కంటే మటన్ లివర్‌ను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. మటన్ లివర్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా దీన్ని బాగా ఉడికించి తింటారు. ఇందులో విటమిన్ A, విటమిన్ D, విటమిన్ B12, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మటన్ లివర్ తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ B12 రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ చికెన్ లివర్ లేదా మటన్ లివర్‌ను తినడం సరైంది కాదు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అలాగే గర్భిణీలు లివర్ ఆహారాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!