ఈరోజుల్లో జనాలు ఉరుకులు, పరుగులు జీవితాన్ని గడుపుతున్నారు.. దాని వల్ల ఒకరోజు వండిన ఆహారాన్ని రెండు, మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేడి చేసుకుంటున్నారు..ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి.. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది.. అందుకే బయట ఫ్రైడ్ రైస్ లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు..
గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు.. ఆరోగ్య సమస్యలు వస్తాయి..
చాలామంది నాన్ వెజ్ ఫుడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి తర్వాత వేడి చేసి తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది.. కొన్నిసార్లు పెద్ద ప్రమాదమే జరుగుతుంది..
మైక్రోవేవ్ ఓవెన్‌లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్‌లో నిల్వ చేయండి.. ఇలా వేడిగా ఉంటుంది.. అనారోగ్య సమస్యలు రావు..
ఇకపోతే చేపలను మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది.. అంతేకాదు కూర రుచి తగ్గడంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..
పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. చల్లగా ఉన్నా పర్లేదు అలానే తినడం కొంతవరకు మంచిదే..
ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి.. సో వేడి చేసుకొని మళ్లీ మళ్ళీ తినడం కన్న వండుకొని తినడం మంచిది..