Arjuna Tree Bark: అర్జున బెరడుతో ఈ వ్యాధులకు చెక్.. ఎలా ఉపయోగించాలో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున చెట్టు(తెల్ల మద్ది) నుంచి వచ్చేదే అర్జున బెరడు. ఈ బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పూర్వ కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఎన్నో జబ్బులకు నివారణిగా అర్జున బెరడును వినియోగిస్తున్నారు. ఈ బెరడులో ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి. ముఖ్యంగా పోషకాలు, ఫైటోకెమికల్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ట్రైటెర్పెనాయిడ్స్, సపోనిన్లు వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. అర్జునోలిక్ యాసిడ్, గల్లిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్, β-సిటోస్టెరాల్ వంటి అనేక ముఖ్యమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఇది బోలెడన్ని ప్రయోజనాలను కలిగిస్తుంది. అర్జున బెరడుతో ఏయే ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..
Read Also: BRS- BSP Alliance: తెలంగాణలో కొత్త పొత్తు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
అర్జున బెరడు ఏ వ్యాధులకు ఉపయోగిస్తారు?
1. హై బీపీ కోసం
అర్జున బెరడు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అర్జున బెరడులో ఫైటోకెమికల్స్, ముఖ్యంగా టానిన్లు ఉంటాయి. ఇవి కార్డియోప్రొటెక్టివ్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. ఇది ధమనులను విస్తృతం చేసి, రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
2. విరేచనాలు సమస్యల కోసం
విరేచనాలు, జీర్ణ సమస్యల కోసం అర్జున బెరడును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అర్జున బెరడులో ఉండే టానిన్లు ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో.. విరేచనాలు, జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
3. మధుమేహం, కీళ్ళనొప్పుల కోసం
అర్జున బెరడులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉండే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవే కాకుండా.. శరీరంలో చక్కెర స్థాయిని వేగవంతం చేయడం ద్వారా మధుమేహం వల్ల కలిగే మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్‌తో సహా అనేక రకాల దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులతో మంట వస్తుంది. ఈ క్రమంలో.. ఇది సమర్థవంతంగా సహాయపడుతుంది. అంతే కాకుండా, కీళ్లలో వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
అర్జున బెరడు ఎప్పుడు త్రాగాలి, ఎంత త్రాగాలి..
ఉదయం, సాయంత్రం 10-10 mg అర్జున బెరడు తీసుకోవాలి. మీరు దీన్ని టీలో తీసుకుంటారా లేదా పాలతో తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఒకవేళ ఇలా తీసుకున్నట్లైతే.. ముందుగా దీనిని పొడిగా చేసుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?