అర్జున చెట్టు(తెల్ల మద్ది) నుంచి వచ్చేదే అర్జున బెరడు. ఈ బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పూర్వ కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఎన్నో జబ్బులకు నివారణిగా అర్జున బెరడును వినియోగిస్తున్నారు. ఈ బెరడులో ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి. ముఖ్యంగా పోషకాలు, ఫైటోకెమికల్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ట్రైటెర్పెనాయిడ్స్, సపోనిన్లు వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. అర్జునోలిక్ యాసిడ్, గల్లిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్, β-సిటోస్టెరాల్…