Brain Stroke Treatment: బ్రెయిన్ స్ట్రోక్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే రోగి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ సమస్యతో ప్రతి ఏడాది 1.8 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మారుతోందని వైద్యులు చెబుతున్నారు. నేడు వైద్యులు ఈ సమస్యను ముందస్తుగా గుర్తించడం, వేగవంతమైన చికిత్స అందించడం వంటి చేయడంతో మరణాల రేటు తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. అయితే ప్రజలు స్ట్రోక్ గురించి తెలుసుకోవడం, వాటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది?
స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు అధిక రక్తపోటు (రక్తపోటు) అనేది స్ట్రోక్‌కు ఒక కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తి రక్తపోటు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోల్చితే ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. అధిక కొలెస్ట్రాల్ కూడా దీనికి కారణం కావచ్చని సూచించారు. మెదడులోని సిరలో అడ్డంకులు ఏర్పడినప్పుడు లేదా సిర అకస్మాత్తుగా చీలిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుందని వైద్యులు చెప్పారు. ధూమపానం కూడా ప్రమాద కారకం అని హెచ్చరించారు.
ఇవి స్ట్రోక్ లక్షణాలు కావచ్చు..
పలువురు వైద్యులు మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో నిర్లక్ష్యం వహించ వద్దని సూచించారు. సకాలంలో చికిత్స అందించకపోతే రోగి ప్రాణాలను కాపాడటం కష్టమవుతుందని హెచ్చరించారు. వాస్తవానికి ఈ సమస్య లక్షణాలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, దృష్టి మసకబారడం, తల తిరగడం, మాట్లాడటం లేదా నడవడంలో ఇబ్బంది ఎదురైతే, ఇవి స్ట్రోక్ లక్షణాలు కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ.. స్ట్రోక్ చికిత్సలో అతిపెద్ద సవాలు ఏం చేయాలో కాదని, ఎప్పుడు చేయాలో అని చెప్పారు. స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం ఆలస్యం కావడం వల్ల లక్షలాది న్యూరాన్లు దెబ్బతింటాయని హెచ్చరించారు. అటువంటి పరిస్థితిలో మెరుగైన చికిత్స చాలా అవసరం అని అన్నారు.
చికిత్సలో కొత్త పద్ధతులు..
పలువురు వైద్యులు మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ చికత్స విధానంలో అనేక కొత్త పద్ధతులు వచ్చాయని చెప్పారు. రోగి ప్రాణాలు కాపాడటం విషయంలో వైద్యుడి అవగాహన, అనుభవం ఎల్లప్పుడూ ముఖ్యమైనవే అయినప్పటికీ, నేటి సాంకేతికత, దానిపై వైద్యులకు ఉన్న అవగాహన రోగి ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతాయని చెబుతున్నారు. ఒక రోగికి పెద్ద సెరిబ్రల్ వెసెల్ బ్లాక్ ఉందని అనుమానించినట్లయితే, ఆధునిక పరీక్షలు, యంత్రాలు మెదడులోని ఏ భాగాలు ప్రభావితమయ్యాయో, ఏ ప్రాంతాలు సురక్షితమైనవో, ఎక్కడ రక్తస్రావం ప్రమాదంలో ఉందో త్వరగా చూపించగలవని చెప్పారు. ఇది వైద్యులు త్వరగా, కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగికి వైద్యం ఆలస్యం కావడం వల్ల మెదడు కణాలకు శాశ్వత నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
READ ALSO: Geyser Safety Tips: గీజర్ వాడుతున్నారా? అయితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి!