Geyser Safety Tips: అసలే ఇప్పుడు చలికాలం మొదలైంది. రోజు ఉదయం స్నానం చేయాలంటే కచ్చితంగా హీట్ వాటర్ ఉండాల్సిందే. వాస్తవానికి ఈ రోజుల్లో గీజర్ లేని ఇళ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో కూడా గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ స్టోరీ మీకోసమే.. ఎందుకంటే గీజర్ వాడితే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు. గీజర్ వాడితే ప్రాణాలకు ప్రమాదం ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారా.. ఇళ్లలో ఉండే ఎయిర్ కండిషనర్లు (ACలు) ఎలా అయితే సర్వీస్ చేయించుకుంటామో అచ్చం అలాగే, ఎలక్ట్రిక్ గీజర్లు కూడా సర్వీస్ చేయించాలని చెబుతున్నారు. లేదంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
లీకేజ్ లేదా వైర్ సమస్యలు..
సాధారణంగా వాటర్ హీటర్ అనేది అధిక వోల్టేజ్ వద్ద పనిచేస్తుంది. కొన్ని సమయాల్లో ట్యాంక్‌లో వాటర్ లీక్ అనేది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. పలు సందర్భాల్లో ఇది తీవ్రమైన విద్యుత్ షాక్‌కు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుజాగ్రత్తగా చాలా కాలం తర్వాత మీ ఎలక్ట్రిక్ గీజర్‌ను ఆన్ చేసే ముందు దాన్ని సర్వీస్ చేయడం ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. సర్వీసింగ్ అంటే ఎలక్ట్రిక్ గీజర్‌పై ప్రాథమిక, ముఖ్యమైన తనిఖీలను చేయడం అని చెబుతున్నారు. ఎలాంటి సర్వీస్ చేయించకుండా వినియోగిస్తే ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఏడాదికి ఎన్ని సార్లు సర్వీసింగ్ చేయించాలి..
ఎలక్ట్రిక్ గీజర్‌కు సర్వీసింగ్ చేయడం అంటే దాని వైరింగ్, లీకేజీలు, సాకెట్ల స్థితిని తనిఖీ చేయడం. గీజర్‌లో ఏదైనా లోపం లేదా నష్టం ఉంటే, దానిని సకాలంలో పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. భద్రత, సరైన నీటి సరఫరాను నిర్ధారించడానికి ఎలక్ట్రిక్ గీజర్లను ఏడాదికి ఒకసారి సర్వీసింగ్ చేయించాలని చెబుతున్నారు. వైరింగ్ తప్పుగా ఉండటం వల్ల ఇల్లు అంతటా షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. మీ ప్రాంతంలో ఉప్పునీరు ఉంటే మీ ఎలక్ట్రిక్ గీజర్‌ను సంవత్సరానికి రెండుసార్లు సర్వీసింగ్ చేయించుకోవాలని సూచించారు. ఎందుకంటే ఉప్పునీరు విద్యుత్ మూలకాలు, రాడ్‌లు, స్టీల్ ట్యాంకులు మొదలైన వాటిని త్వరగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు.
గీజర్‌తో ప్రమాదం ఏమిటి..
ఎలక్ట్రిక్ గీజర్ లీకేజీ వల్ల కుళాయి నుంచి వచ్చే నీటిలోకి విద్యుత్తు లీక్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీరు తీవ్రమైన విద్యుత్ షాక్‌కు కారణం కావచ్చని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో ఈ తీవ్రమైన షాక్ ప్రాణాంతకం కూడా కావచ్చని చెబుతున్నారు.
READ ALSO: Declared Dead Alive: రోగి చనిపోయినట్లు ప్రకటించిన వైద్యులు.. కానీ 15 నిమిషాల తర్వాత అద్భుతం..