ఈరోజుల్లో ఎంత ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అందులో సమ్మర్ లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెయ్యాలి. ఎన్ని డబ్బులు పెట్టినా ఆరోగ్యాన్ని మాత్రం కొనలేం. కానీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఎలాంటి డబ్బులు పెట్టడం అవసరం లేదు.. ఈరోజు సమయం విలువైనది.. దాంతో సులువుగా చేసుకొనే టిఫిన్స్ లలో ఉప్మా ఒకటి… గోధుమ రవ్వ కన్నా బొంబాయి రవ్వ ఉప్మా ను ఎక్కువగా చేసుకుంటారు.. ఈ రవ్వను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బొంబాయి రవ్వ ఉప్మా ను ఎక్కువగా తీసుకుంటారు. వారంలో ఒక్కసారైనా ఈ బొంబాయి రవ్వను టిఫిన్ లో తింటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందట.. ఈ రవ్వతో చేసిన టిఫిన్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. ఈ ఉప్మా తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి ఉండదు.. దాంతో బరువు కూడా తగ్గుతారు.. శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోతుంది..
ఇకపోతే షుగర్ పేషంట్స్ కు ఉప్మా చాలా మంచిది. షుగర్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయట. అంతేకాకుండా శరీరానికి పాస్పరస్, ఇతర మినరల్స్ విపరీతంగా అందుతాయట.. అలాగే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. వారానికి కనీసం ఒక్కసారి అయిన ఈ రవ్వను ఏదొక రూపంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఏదైన తక్కువగా తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.