Health Tips: ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది చాలా సాధారణంగా వచ్చే వ్యాధిలా మారిపోయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ వ్యాధి కేవలం ఒక వయసు వారినే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తుంది. అసలు ఈ వ్యాధికి ఏజ్‌తో సంబంధం ఉండటం లేదు. ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఈ వ్యాధి కారణంగా రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంది. దీంతో అలసట, బలహీనత, దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా.. ఆయుర్వేదంలో వేపను మధుమేహానికి చాలా ప్రభావవంతంగా భావిస్తారు.
READ ALSO: Mirai : ప్రభాస్ వాయిస్ ఓవర్ రహస్యాన్ని చెప్పిన డైరెక్టర్
పరిశోధనల ప్రకారం.. వేప ఆకులలో ఉండే యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 4-5 ఆకులను నమిలితే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చురుకుగా ఉంటాయిని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుందని, అలాగే దీనితో మధుమేహాన్ని చాలా కాలం పాటు నియంత్రించవచ్చు పేర్కొంటున్నారు. వేప ఆకులు, బెరడు సహజ ఔషధంలా పనిచేస్తాయి. వేపలో ఉన్న యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేయడం ద్వారా ఇతర వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. ఈ కారణంగానే వేపను డయాబెటిస్‌కు దివ్యౌషధంగా పరిగణిస్తారు.
మధుమేహానికి మాత్రమే కాదు..
వేప ఆకులు మధుమేహానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. వీటిని తినడం వల్ల శరీరంపై మచ్చలు, దురద, ఇతర చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. శరీరం నుంచి మలినాన్ని తొలగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేప నమలడం వల్ల చిగుళ్లు, దంతాలు బలంగా ఉంటాయి. వేపాకు కాలేయం, మూత్రపిండాలకు మేలు చేస్తుంది.
వేప ఆకులు గాయం మానే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
READ ALSO: Qatar Summit: ఖతార్‌లో 50 ముస్లిం దేశాల సమావేశం.. ఇజ్రాయెల్‌కు ప్రమాదం ఉందా..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.