అందం అనేది ఆడవాళ్ళకే సొంతం. అనుకుంటే పొరపాటే మగవారు కూడా అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..అయితే ఆడవారి చర్మం కంటే మగవారి చర్మం రఫ్ గా ఉంటుంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, పొల్యూషన్, దుమ్ము,ధూళి, అలవాట్లు వల్ల మగవారి చర్మంపై ప్రభావం పడుతున్నాయి. అయితే మార్కెట్లో మగవారి కోసం కూడా అనేక రకాల క్రీం లు అందుబాటులో ఉన్నాయి. కాని రసాయనాలు కలిసిన ఆ క్రీం ల కంటే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగంటే… సింపుల్ చిట్కాలు..
*.సాధారణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. షేవింగ్ వల్ల చర్మం కటినంగా మారి చర్మంపై తేమను తీసివేస్తుంది. కనుక చల్లటి నీటితో షేవింగ్ చేసుకున్న తర్వాత మాయిశ్చ రైజర్ లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.. చర్మం మృదువుగాను, అందంగా తయారవుతుంది..
*. మగవారి సౌందర్యానికి ద్రాక్ష రసం బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఆహారంతో పాటు ద్రాక్ష రసం తీసుకుంటే చర్మాన్ని అందంగా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది.. తెల్లగా కూడా అవుతారు..
*.రోజు ముఖం పై ,మెల్లగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం తాజాగా ఉంటుంది.
*. రోజు పాలతో ముఖాన్ని కడిగితే మలినాలు తొలగిపోయి మంచి ఫలితం ఉంటుంది.. చర్మం రంగు పెరుగుతుంది..
*.మంచినీరు అధికంగా అంటే కనీసం రోజుకి రెండు లీటర్ల నీటిని తాగడం వల్ల చర్మంపై ముడతలు పడకుండా ఉంటుంది.
*.మీ చర్మాన్ని ఎక్కువ సమయం ఎండలో లేకుండా చూసుకోవాలి. ఎందుకంటె ఎండ వల్ల చర్మం ముడతలు పడటానికి అవకాశo ఎక్కువ.. అందుకే సేఫ్టీ కోసం టోపీలను వాడటం మంచిది..
*. మగవారికి ముఖ్యమైన చిట్కా.. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల వల్ల అసలు వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. రక్తనాళాలు అవసరమైన దానికన్నా ఎక్కువగా సాగి ఇబ్బంది పెడతాయి.
*. ఫేస్ వాష్ బదులు నిమ్మ రసంతో ముఖం కడిగితే సహజమైన బ్లీచ్ లా పనిచేస్తుంది.
*. .రోజు పడుకునే ముందు ఐస్ క్యుబ్స్ తో పదిహేను నిమిషాలు ముఖంపై మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కాలతో పాటు టైం కి తిని, కంటికి సరిపడా నిద్ర, తగినంత విశ్రాంతి తీసుకుంటే అందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.. ఎప్పుడూ ఎండకు వెళ్లినా కూడా చల్లగ ఉండే నీళ్లతో కడుగుతూ ఉండాలి.. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను వాడటం వల్ల మగవారి అందానికి ఎటువంటి డోకా ఉండదు..