Don’t Skip Dinner: బరువు తగ్గేందుకు రాత్రి భోజనం మానేస్తున్నారా..?.. ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యువత ఫిట్ నెస్ పై ఆసక్తి కనబరుస్తోంది. సన్నాగా, ఆరోగ్యంగా ఉండాలని యువత కోరుకుంటోంది. కాని మన ఆహారపు అలవాట్లు, లేదా పలు రకాల వ్యాధుల కారణంగా బరువు పెరుగుతుంటారు. ఆ బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసే వాటిలో కొన్ని మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం, అధిక బరువు సమస్య ఎక్కువవుతోంది. దాని బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పలు సమస్యలు కారణమని తెలుస్తోంది. ఇలా బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాల్లో భాగంగా కొందరు రాత్రి భోజనం సైతం మానేస్తుంటారు. అలా చేస్తే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. రాత్రి భోజనం చాలా ముఖ్యం.
Also Read
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
పడుకునే ముందు శరీరానికి కావాల్సిన కీలకమైన కేలరీలు, పోషకాలను అందిస్తుంది. 24 గంటల్లో శరీరం ఎక్కువ సమయం తినకుండా నిద్రపోతుంది. కాబట్టి రాత్రి తప్పకుండా భోజనం చేయలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి భోజనం మానేస్తే చాలా తక్కువ రోజుల్లో బరువు తగ్గొచ్చు కాని.. ఇది దీర్ఘకాలికంగా మంచిది కాదు. ఈ అలవాటు వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ముఖ్యంగా జీవక్రియ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆకలి కోరికలు పెరగడంతో సూక్ష్మపోషకాల లోపానికి దారి తీస్తుంది. రాత్రి భోజనం తినకపోవడం వల్ల మీ నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అందుకే కసరత్తులు చేస్తూ.. శరీర బరువును తగ్గించేందుకు కసరత్తులు చేయాలి. కాని ఇలా రాత్రి భోజనం మానేయడంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో వేరే విధంగా బాడీ తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్‌లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..