చర్మ సంరక్షణ కోసం ఈ 7 రొటీన్ స్టెప్స్ పాటిస్తే చాలు మీ స్కిన్ గ్లోతో మెరిసిపోతుంది. సాధారణంగా అమ్మాయిలు గ్లాస్ స్కిన్ గ్లో కోసం ఏవేవో పద్ధతులు ట్రై చేస్తుంటారు. కానీ ఈ రొటీన్ స్టెప్స్ వాడకపోతే మాత్రం అందువల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రతిరోజూ ఈ స్కిన్ రొటీన్ ను పాటించడం వల్ల మీ స్కిన్ కాంతివంతంగా మారడమే కాకుండా చర్మ సమస్యలన్నీ మాయమవుతాయి. ఆ 7 స్టెప్స్ ఏంటంటే…
డబుల్ క్లెన్స్
ముందుగా మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. డబుల్ క్లెన్స్ చేయడం వల్ల మీ ముఖం నుండి ధూళి, నూనె వంటివి తొలగిపోయి తాజాగా కన్పిస్తుంది. మొదట మీ ముఖాన్ని నూనె ఆధారిత క్లెన్స్ తో శుభ్రం చేయండి. ఇది మేకప్ అవశేషాలు, ఇతర జిడ్డును తొలగిస్తుంది. ఆ తరువాత నీటి ఆధారిత ఫోమింగ్ క్లెన్స్ ను వాడండి. అప్పుడు అది మీ చర్మాన్నీ రిఫ్రెష్ చేస్తుంది.
ఎక్స్‌ఫోలియేట్
ఎక్స్‌ఫోలియేట్ మీ ముఖం మీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సున్నితమైన మసాజ్ చేస్తూ మీ ముఖాన్ని స్క్రబ్ తో శుభ్రపరచండి. ఈ దశ మీ రంధ్రాలలో మిగిలిపోయిన అదనపు నూనెను తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది.
టోనర్
మీ చర్మం పిహెచ్ ను సమతుల్యం చేయడంలో టోనర్లు సహాయపడతాయి. ఇది చర్మాన్ని మరమ్మత్తు చేస్తుంది. సాధారణంగా చాలామంది టోనర్ల వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుందని, చర్మం పొడిగా మారుతుందని అంటారు. దానికి కారణం లేకపోలేదు. ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న టోనర్లను కాకుండా మీ చర్మానికి సరిపోయే టోనర్లను ఎంచుకోండి.
Read Also : ఫోటోషూట్లతో నెట్టింట్లో జాన్వీ కపూర్ రచ్చ…!
ఎసెన్స్
చర్మ సంరక్షణలో ఇది కీలక దశ. ఎసెన్స్ చర్మంపై తగినంత తేమ ఉండేలా మెరుగుపరుస్తుంది. దీని వలన క్లియర్ స్కిన్ లభిస్తుంది.
సీరం
విటమిన్ సి సీరం కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. సీరం నలల్టి వలయాలు, స్కిన్ టోన్, పిగ్మెంటేషన్ సమస్యలను పరిష్కరిస్తుంది.
మాయిశ్చరైజర్
మాయిశ్చరైజర్ రెగ్యులర్ గా వాడడం వల్ల ప్రారంభ దశలోనే స్కిన్ పై ముడతలు రాకుండా అది అడ్డుకుంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మర్చి గ్లాస్ స్కిన్ గ్లో ఇస్తుంది.
సన్‌స్క్రీన్
సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నుండి చర్మాన్ని రక్షించడానికి SPF ఉండే సన్ స్క్రీన్ ను వాడండి. సన్‌స్క్రీన్ స్కిన్ టోన్, స్కిన్ పై రంధ్రాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ 7 స్టెప్స్ మాత్రమే కాకుండా గ్లాస్ స్కిన్ గ్లోతో స్కిన్ మెరవాలంటే షీట్ మాస్క్‌లు, గ్రీన్ డైట్ కూడా చాలా ముఖ్యమైనవి. మీ చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే ఎప్పుడూ హైడ్రేట్ గాను ఉండడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోండి.