RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
- రైల్వేలో 3,477 ఉద్యోగాలు
- గ్రాడ్యుయేట్లకు భారీ నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRB NTPC Recruitment 2026 Notification: రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ లెవల్లో 3,477 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబర్ 8న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 నవంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి పోస్టుల వివరాలు, వయోపరిమితి, పరీక్ష విధానం తదితర సమాచారాన్ని అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
3,477 పోస్టుల భర్తీ
RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 3,477 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రైల్వేలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టులకు ఈ నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు.
Also Read
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
విద్యార్హత ఏమిటి?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హతల్లో ఏవైనా అదనపు నిబంధనలు ఉంటే పూర్తి అధికారిక నోటిఫికేషన్లో వెల్లడించే అవకాశం ఉంది.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సును 2027 జనవరి 1 నాటికి లెక్కిస్తారు. కనీస, గరిష్ఠ వయోపరిమితి, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర కేటగిరీలకు వర్తించే వయో సడలింపుల వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడాలి.
దరఖాస్తు ఫీజు ఎంత?
RRB NTPC Graduate Recruitment 2026కు కేటగిరీ ఆధారంగా దరఖాస్తు ఫీజు నిర్ణయించారు.
జనరల్ / OBC / EWS: రూ.500
SC / ST: రూ.250
దివ్యాంగ అభ్యర్థులు: రూ.250
మహిళా అభ్యర్థులు: రూ.250
ఫీజు చెల్లింపు విధానం, రీఫండ్‌కు సంబంధించిన నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు కింది విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ముందుగా RRB అధికారిక అప్లికేషన్ వెబ్సైట్ rrbapply.gov.inలోకి వెళ్లాలి.
2. హోమ్‌పేజీలో కనిపించే RRB NTPC Graduate Recruitment ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. అభ్యర్థి పేరు, విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
4. అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను అప్లోడ్ చేసి, కేటగిరీకి అనుగుణంగా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
5. దరఖాస్తును సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్అవుట్ తీసుకోవాలి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!