పదో తరగతి పాసైన వారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. రైల్వే లో ఖాళీలను భర్తీ చెయ్యడానికి కేంద్రం వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్).. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా 1033 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు..1033
ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మొదలకు వాటికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అర్హతలు..
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి..
వయస్సు…
ఈ ఉద్యోగాలకు సంబంధించి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ..
మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు చివరి తేదీ..
ఈ నెల 2వరకు దరఖాస్తులను స్వీకరించబడతాయి..
ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాల గురించి తెలుసుకోవాలంటే.
https://secr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి..
ఈ ఉద్యోగాల పై ఆసక్తికలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..
అదే విధంగా టాటా గ్రూప్ సంస్థలో కూడా ఇంజినీరింగ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు..ఏడాదికి రూ. 7 లక్షల వరకు జీతాన్ని పొందవచ్చు..