జాబ్ వ్యక్తి స్థితిని.. కుటుంబ పరిస్థితిని మార్చేస్తుంది. అందుకే జాబ్స్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు యువత. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు ఇదే మంచి ఛాన్స్. ఇటీవల కేంద్ర విద్యుత్ సంస్థ అయినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 60 వేల జీతం పొందొచ్చు.
ఎన్టీపీసీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 31 పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఫుల్ టైమ్ రెగ్యూలర్ డిప్లొమా(ఎలక్ట్రికల్, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్) మినిమం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 60 శాతం మార్కులతో బీఎస్సీ కెమిస్ట్రీ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు స్విచ్ యార్డ్, స్విచ్ గేర్, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ట్రాన్స్‌మిషన్ తదితర విభాగాల్లో కనీసం 2 సంత్సరాల అనుభం ఉండాలి. అభ్యర్థుల వయసు 31-01-2025 తేదీ నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల జీతం అందిస్తారు. జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300/- చెల్లించాలి. SC/ST/PwBD/XSM కేటగిరీకి చెందిన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ www.nspcl.co.in/pages/careers# పై క్లిక్ చేయండి.