Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏటా నిరుద్యోగుల సమస్యలు పెరుగుతున్నాయి.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను విడుదల చెయ్యడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..అభ్యర్థులు QCI అధికారిక వెబ్‌సైట్ qcin.orgలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది.. ఈ పోస్టులకు అడ్మిట్ కార్డులను 14 ఆగస్టు న విడుదల చెయ్యనున్నారు..
ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 1న నిర్వహిస్తారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 553 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది..పోస్టుల వివరాలు..
బయో-టెక్నాలజీలో 50,
బయో-కెమిస్ట్రీలో 20,
ఫుడ్ టెక్నాలజీలో 15,
కెమిస్ట్రీలో 56,
పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 9,
బయో-మెడికల్ ఇంజనీరింగ్‌లో 53,
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌లో 108,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 29,
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 63, ఫిజిక్స్‌లో 30,
సివిల్ ఇంజనీరింగ్‌లో 9,
మెకానికల్ ఇంజనీరింగ్‌లో 99,
మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో 4,
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో 8 ఉన్నాయి..
అభ్యర్థులు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.1,000 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwD/ దివ్యాంగులు (PH), అలాగే అన్ని వర్గాల మహిళలు రూ.500 రూపాయలు చెల్లించాలి..
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ఇకపోతే అభ్యర్థులు మూడు ఫేజ్‌ల్లో నిర్వహించే టెస్టులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థులు ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30% మార్కులు సాధిస్తేనే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. OBC/EWS కేటగిరీ అభ్యర్థులు 25%, అన్ని ఇతర వర్గాల అభ్యర్థులు కనీసం 20% స్కోర్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ఇంగ్లిష్ లో మాత్రమే నిర్వహిస్తారు..ఎంపికైన అభ్యర్థులు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం పొందుతారు.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..