Green fuel: భూమి లోతుల్లో అద్భుత నిధి దాగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది రాబోయే 1.70 లక్షల సంవత్సరాలకు సరిపడేలా ప్రపంచ అవసరాలను తీర్చగలదు, అది కూడా ఎలాంటి కాలుష్యం కాకుండా శక్తిని అందిస్తుంది. ఆ నిధి ఏంటో కాదు, సహజ రూపంలో ఉ్న ‘‘హైడ్రోజన్’’. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, డర్హామ్ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతమైన ఆవిష్కరణను చేసింది. భూమి కాంటినెంటల్ క్రస్ట్‌లో లోతుల్లో , ఉపరితలం కింద హైడ్రోజన్ భారీ నిల్వ దాగి ఉందని వారు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఆవిష్కరణ ప్రపంచ శక్తి రంగంలో కొత్త మలుపుకు దారి తీసింది.
హైడ్రోజన్ ఎందుకు ప్రత్యేకం..?
హైడ్రోజన్‌ను ‘‘గ్రీన్ ఫ్యూయల్’’గా పిలుస్తారు. దీనిని మండించినప్పుడు పొగ లేదా CO₂ విడుదల కాదు. నీరు మాత్రమే ఏర్పడుతుంది. వాతావరణ మార్పులకు వ్యతిరేక పోరాటంలో ఇది అత్యుత్తమ శక్తి వనరుగా ఉపయోగపడుతుంది. మనం ఉపయోగించే హైడ్రోజన్ ఎక్కువగా బొగ్గు లేదా గాలి నుంచి తయారవుతుంది. ఇది కాలుష్యానికి కారణమవుతుంది. కానీ భూమి లోపల ఉన్న హైడ్రోజన్ పూర్తిగా సహజమైంది. దీనిని ‘‘వైట్ హైడ్రోజన్’’గా పిలుస్తారు.
ఈ నిధి ఎక్కడ ఉంది..?
ఈ వాయువు చమురు లేదా గ్యాస్ లాగా పెద్ద రిజర్వాయర్‌లో ఉండదు. ఇది రాళ్లు, నీటి రసాయన ప్రతిచర్య ద్వారా నెమ్మదిగా ఏర్పడుతుంది. శాస్త్రవేత్తలు కెనడాలోని పాత రాతి ప్రాంతమైన కెనడియన్ షీల్డ్‌లో దీనిని మ్యాప్ చేశారు. ఇక్కడ హైడ్రోజన్ భూమి కంద నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
దీనిని వెలికితీయడం ఎలా..?
దీనిని వెలికి తీయడం సాధ్యమే కానీ, అంత సులభం మాత్రం కాదు. సాంప్రదాయ చమురు-గ్యాస్ డ్రిల్లింగ్ లో దీనిని వెలికితీయలేము. దీనికి మరింత కొత్త సాంకేతికత, ఖచ్చితమైన మ్యాపింగ్ అవసరం. హైడ్రోజన్ ఎక్కడ ఏర్పడుతుంది, అది ఎలా ప్రవహిస్తోంది, ఎక్కడ పేరుకుపోతుందనే చెప్పగల సాంకేతికతపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.
బ్యాక్టీరియాతో హైడ్రోజన్‌కు ప్రమాదం..
భూమి కింద హైడ్రోజన్‌ను తినే కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఒక ప్రదేశంలో ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటే, హైడ్రోజన్ నిల్వలు అక్కడ తగ్గిపోతుంటాయి. అందువల్ల శాస్త్రవేత్తలు ఈ వాయువును సురక్షితంగా నిల్వ చేయబడిన, తప్పించుకోలేని ప్రదేశాలను కనుగొనాల్సి ఉంది. ఒక అంచనా ప్రకారం, ఈ నిల్వ రాబోయే 1.7 లక్షల ఏళ్ల ప్రపంచ అవసరాలను తీర్చగలదు.