NTPC: ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ జాబ్స్.. రాత పరీక్ష లేదు.. నెలకు 1.4 లక్షల జీతం
- ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ జాబ్స్
- నెలకు 1.4 లక్షల జీతం
- రాత పరీక్ష లేదు
- అప్లికేషన్ కు చివరి తేదీ ఫిబ్రవరి 13
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 475 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ఎలక్ట్రికల్ 135, మెకానికల్ 180, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ 85, సివిల్ 50, మైనింగ్ 25 పోస్టులున్నాయి.
ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులు 55 శాతం.. ఇతరులు కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్(GATE 2024) పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD/EBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు వారి గేట్-2024 స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
Also Read
- Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
- NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
- ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
- TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన వారు నెలకు రూ.40వేల నుంచి 1.4 లక్షల వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. SC/ST/PwBD/Ex Servicemen/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 13 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!