ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటిషన్ ఉంది. వందల్లో జాబ్స్ ఉంటే వేలల్లో పోటీపడుతున్నారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. తక్కువ కాంపిటిషన్ తో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు.
Also Read:Thummala Nageswara Rao: చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్.. రుణ మాఫీపై మంత్రి కీలక ప్రకటన..
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి అగ్రికల్చర్ B.Sc డిగ్రీ పాసై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులు B.Scలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. SC, ST వర్గాలకు చెందిన అభ్యర్థులకు కనీస మార్కులు 55 శాతంగా నిర్ణయించారు. అభ్యర్థి వయస్సు మార్చి 1, 2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరి వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Kethika : సమంత, శ్రీలీల బాటలో మరో హీరోయిన్
ఈ పోస్టులకు సీబీటీ, మెడికల్ టెస్ట్ ల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం శిక్షణ కాలం ఉంటుంది. దీనిలో వారికి నెలకు రూ. 33,000 జీతం వస్తుంది. ఒక సంవత్సరం శిక్షణ తర్వాత నెలకు రూ. 37,000 జీతం అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.