జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోవాలని డిసైడ్ అయ్యారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. భారత ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 83 పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీస్) 13, జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రిసోర్సెస్) 66, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) 4 పోస్టులున్నాయి.
Also Read:Pushpa 2 : పుష్ప- 2 లేటెస్ట్ కలెక్షన్స్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్
ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ పాసై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.4 లక్షల జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 1000 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో మార్చి 18 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. మళ్లీరాని ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.