జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలతోనే సాధ్యం. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మంచి జీతం, ప్రభుత్వం అందించే సౌకర్యాల కారణంగా గవర్నమెంట్ జాబ్స్ కు ప్రియారిటీ ఇస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 234 పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిప్లొమా విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ , కెమికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. UR/ OBCNC/ EWS అభ్యర్థులు 60 శాతం, SC/ ST/ PwBD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 14/ 02/ 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి రూ. 1.2 లక్షల వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు UR/ OBC/ EWS అభ్యర్థులు 1180/- చెల్లించాలి. SC, ST & PwBD అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం HPCL అధికారిక వెబ్ సైట్ www.hindustanpetroleum.com పై క్లిక్ చేయండి. అప్లై చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. లైఫ్ సెట్ చేసే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి.