ప్రభుత్వ సెక్టార్ లో ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. గవర్నమెంట్ జాబ్స్ కు కాంపిటిషన్ హెవీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో భారతీయ రైల్వే గుడ్ న్యూ్స్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి లక్కీ ఛాన్స్. అయితే ఈ పోస్టుల కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో అంటే ఫిబ్రవరి 22న అప్లికేషన్ గడువు ముగియనున్నది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి.
32,438 ఉద్యోగ ఖాళీల్లో.. 13,187 ట్రాక్ మెయింటైన్ పోస్టులు, పాయింట్స్ మెన్ ఉద్యోగాలు 5,058, అసిస్టెంట్ ఉద్యోగాలు 3,077 ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని విభాగాల్లోనూ ఖాళీలను భర్తీ చేయనునున్నారు. RRB గ్రూప్ D పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. NCVT నుంచి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 36 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
Also Read:Hamas: ముగ్గురు ఇజ్రాయెల్ బందీల విడుదల.. ట్రంప్ హెచ్చరికలు పట్టించుకోని హమాస్
రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ పీహెచ్/ఈబీసీ, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.