పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలకు బ్రేక్‌లు పడ్డాయి. గత కొద్దిరోజులుగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న గోల్డ్ రేట్స్‌కు కళ్లెం పడ్డాయి. రెండు రోజుల నుంచి బంగారం ధరలు నెమ్మది.. నెమ్మదిగా తగ్గుతున్నాయి. బుధవారం కొంచెం ఉపశమనం కలిగించగా.. గురువారం కూడా మరోసారి ధరలు భారీగా తగ్గి ఊరటనిచ్చాయి. తులం గోల్డ్ ధరపై రూ.930 తగ్గాయి. ఇక సిల్వర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు.
ఇది కూడా చదవండి: Trump: నేడు ట్రంప్‌తో షెహజాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ భేటీ.. నిశితంగా పరిశీలిస్తున్న భారత్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.930 తగ్గి రూ.1, 14, 440 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.850 తగ్గి రూ.1, 04, 900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700 తగ్గి రూ.85,830 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం రూ. 1,40, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,50,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,40, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: యూఎన్‌లో కుట్ర జరిగింది.. కారకాల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు