Site icon NTV Telugu

Trump-Zelenskyy: సోమవారం అమెరికాకు జెలెన్‌స్కీ పయనం.. ట్రంప్‌తో కీలక భేటీ

Trumpzelenskyy

Trumpzelenskyy

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చర్చలు జరుపుతున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. అయినా ప్రయోజనం లభించలేదు. ఇక ట్రంపే స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న అలాస్కాలో పుతిన్-ట్రంప్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య 3 గంటల పాటు సమావేశం జరిగింది. అయితే ఎలాంటి ఒప్పందం జరగకుండానే అసంపూర్తిగా సమావేశం ముగిసింది. మరోసారి మాస్కో వేదికగా ట్రంప్-పుతిన్ కలవనున్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏం సమాధానమిచ్చిందంటే..!

ఇక పుతిన్‌తో భేటీ విషయాలను ఫోన్ ద్వారా జెలెన్‌స్కీతో ట్రంప్ పంచుకున్నారు. ఇద్దరి మధ్య గంటకు పైగా సంభాషణ జరిగింది. అలాగే అలాస్కా నుంచి వాషింగ్టన్ వెళ్లే ముందు యూరోపియన్ నేతలతో కూడా ట్రంప్ మాట్లాడారు. ఇక శాంతి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉండాలని జెలెన్‌స్కీని కోరారు. కాల్పుల విరమణ కంటే.. యుద్ధం ముగింపునకే పుతిన్ మొగ్గు చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు. త్రైపాక్షిక సమావేశం కోసం ట్రంప్ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ మద్దతు ఇచ్చారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు నిర్మాణాత్మక సహకారానికి తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్‌స్కీ చెప్పారు.

ఇది కూడా చదవండి: Shubhanshu Shukla: రేపు భారత్‌‌కు రానున్న వ్యోమగామి శుభాంశు శుక్లా

ఇక డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు సోమవారం వాషింగ్టన్‌కు వెళ్తున్నట్లు జెలె‌న్‌స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య హాట్ హాట్‌గా సమావేశం జరిగింది. మధ్యలోనే జెలెన్‌స్కీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఘర్షణ తర్వాత తిరిగి రెండోసారి ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశం అవుతున్నారు.

Exit mobile version