వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం భారత్‌కు రానున్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు వెళ్లారు. రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భారత్‌కు వస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ చేరుకున్నాక.. ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: అమెరికా బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. సెండాఫ్ ఇచ్చిన భర్త!
యాక్సియం-4 మిషన్ కోసం గతేడాది నుంచి తన స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నట్లు శుభాంశు శుక్లా వెల్లడించారు. ఇది తనను ఎంతో బాధించిందని తెలిపారు. అందరిని కలిసి తన అనుభవాలను పంచుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విమానంలో కూర్చొన్న ఫొటోను పంచుకున్నారు. ఇక సోమవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుభాంశు శుక్లా పాల్గొంటారని వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Putin-Trump: పుతిన్ ఎదుట బీ-2 బాంబర్లు ప్రదర్శన.. దేని కోసం..!
జూన్ 25న చేపట్టిన యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. రోదసిలో 18 రోజులు గడిపారు. శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.