Nottingham: నాటింగ్‌హమ్ దాడిలో భారత సంతతి యువతి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nottingham: సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హమ్ వీధుల్లో ఒక దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన యువతి ఉన్నారు. యువతి వైద్య విద్యను అభ్యసిస్తోంది. దుండుగుడి దాడిలో చనిపోయిన మృతుల్లో ఒకరు భారత సంతతి యువతి ఉన్నారని స్థానిక పోలీస్ అధికారులు బుధవారం వెల్లడించారు. దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నామని,దాడి వెనుక ఉగ్రకుట్ర ఏదైనా ఉందన్న విషయంపై కౌంటర్ టెర్రరిజం పోలీస్ విభాగం విచారణ జరుపుతున్నదని నాటింగ్‌హమ్‌షైర్ పోలీస్ చీఫ్ తెలిపారు.
Read also: Madhya Pradesh: 62 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
భారత సంతతికి చెందిన 19 సంవత్సరాల గ్రేస్ ఓమల్లే కుమార్ నాటింగ్ హామ్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. గ్రేస్ క్రికెటరే కాకుండా మంచి హాకీ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చకుంది. తన స్నేహితురాలు బార్నబీ వెబర్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత ఒక వ్యాన్ డ్రైవర్‌ను హత్య చేసి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతని నుంచి వివరాలను సేకరిస్తున్నారు. బుధవారం నాటింగ్‌హామ్‌లో జరిగిన ఘటనపై బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్ సెషన్ ప్రారంభంలో మాట్లాడారు. ఘటనలో గాయపడిన వారికి అత్యవసర సేవలను అందిస్తున్న వారికి దన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తమ ఆలోచనలు గాయపడిన వారితో మరియు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతో ఉన్నాయన్నారు. UK హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ ఇటువంటి భయంకరమైన సంఘటనల గురించి పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పరిగణించడం లేదని ధృవీకరించారు. పూర్తి వాస్తవాలను నిర్ధారించడానికి నాటింగ్‌హామ్‌షైర్ పోలీసులు కేసు విచారణను కొనసాగిస్తున్నారని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగాఆ పనిచేస్తున్నారని తాను సభకు చెప్పగలనని తెలిపారు. ప్రస్తుతం ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశ్యాల గురించి విచారణను నాటింగ్‌హామ్‌షైర్ పోలీసులు కౌంటర్ టెర్రర్ పోలీసుల సహకారంతో నిర్వహించనున్నారని తెలిపారు. వారి సహకారం తీసుకున్నంత మాత్రాన ఇది తీవ్రవాద దాడిగా పరిగణించబడుతుందని దానర్థం కాదన్నారు.
Nottingham: Bandi Sanjay: చివరి క్షణంలో రద్దైన అమిత్ షా టూర్.. కార్యకర్తలు నిరాశపడవద్దన్న బండి సంజయ్
మంత్రి కొన్ని వివరాలను ప్రకటిస్తూ ఒక దుండుగుడు కత్తితో దాడి చేశాడని తెలిపారు. దాడిలో నాటింగ్‌హామ్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులున్నారు. వారితోపాటు ఒక 60 ఏళ్ల వ్యక్తి ఇయాన్ కోట్స్ కూడా ఉన్నాడని అతను స్థానిక పాఠశాల కేర్ టేకరని.. అతనే వ్యాన్ ఓనరని తెలిపారు. దుండగుడు ఇయాన్ కోట్స్ ను చంపి వ్యాన్‌ను దొంగిలించి తీసుకెళుతూ ముగ్గుర పాదచారులను ఢీకొట్టాడని.. వారు ప్రస్తుతం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. డిటెక్టివ్‌ల ప్రత్యేక బృందం ఈ సంఘటనల చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలిస్తోందని.. రాబోయే రోజుల్లో సాక్ష్యాలను సేకరించి విచారణను కొనసాగిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!