Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్
- బయటకు వచ్చిన సిన్వర్ చనిపోయే ముందు చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు..
- ఓ శిథిల భవనంలోని సోఫాలో యాహ్యా సిన్వర్ కూర్చుని ఉండగా చిత్రీకరించిన ఇజ్రాయెల్ డ్రోన్..
- ఓ కర్రలాంటి వస్తువుతో ఇజ్రాయెల్ డ్రోన్ పైకి విసిరిన యహ్యా సిన్వర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yahya Sinwar: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిలిటెంట్ గ్రూప్ చీఫ్, 2023 అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మట్టుబెట్టింది. కాగా, చనిపోయే ముందు సిన్వర్ యొక్క చివరి కదలికలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఈ కదలికలను ఇజ్రాయెల్ డ్రోన్ ద్వారా రికార్డు చేయబడింది. ఓ శిథిల భవనంలోని సోఫాలో అతడు కూర్చుని ఉండగా.. డ్రోన్ అతడిని వీడియో తీసింది. దాన్ని గమనించిన సిన్వర్ ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంతర్జాతీయ అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Read Also: Gunfire Due To Pizza: పిజ్జా కోసం తుపాకీతో కాల్పులు.. మహిళా పరిస్థితి విషమం
Also Read
ఇక, దీనిపై ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. శిథిలమైన భవనం లోపల హమాస్ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకునేందుకు డ్రోన్‌ను పంపించామన్నారు. తొలుత ఆ వ్యక్తిని తాము యహ్వా సిన్వర్ అనుకోలేదు.. కేవలం మిలిటెంట్ అనే అనుకున్నాం.. ఆ తర్వాత భవనంపై మరోసారి బాంబు దాడి చేయగా.. ఆ భవనం కుప్పకూలిపోయి అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వర్ అని తేలిందన్నారు. అతడి శరీరంపై బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్, గ్రనేడ్లు ఉండటం గుర్తించామని డేనియల్ హగారీ చెప్పుకొచ్చారు.
Read Also: KTR Tweet: మూసీ మురుగులో పొర్లుతూ అందరికీ బురదను అంటించాలని.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
కాగా, దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైనికులు చంపేశారు. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని ఐడీఎఫ్ గుర్తించింది.. దీంతో డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించింది.. గతంలో అతడు ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న సమయంలో సేకరించిన డీఎన్ఏ నమూనాలతో వాటిని పరీక్షించగా.. హమాస్ నేత అని తేలడంతో సిన్వర్ మరణాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించుకుంది. అయితే, అతడి మృతిని హమాస్ మిలిటెంట్ సంస్థ ఇంకా ప్రకటించలేదు.
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024
- Tags
- Benjamin Netanyahu
- GAZA
- Hamas
- IDF
- Israel
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!