Xi Jinping warns of ‘tough challenges’ in China’s ‘new phase’ of Covid: 2023లో చైనా కఠిన సవాళ్లు ఎదుర్కోబోతోందని అధ్యక్షుడు జి జిన్ పింగ్ అన్నారు. కోవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్న సమయంలో జిన్ పింగ్ తన న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కోబోతున్నాయని.. ప్రస్తుతం కోవిడ్ -19 కొత్తదశలోకి ప్రవేశించిందని అన్నారు. భారతదేశం, ఇతర దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాంక్షలు విధించాయని జిన్ పింగ్ అన్నారు. దేశం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని.. ఇది సులభం అయిన ప్రయాణం కాదని అనేక సవాళ్లతో కూడుకున్నది అని జిన్ పింగ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
Read Also: Bihar Man Jackpot: జాక్‌పాట్ కొట్టిన బిహార్ వ్యక్తి.. రూ.49తో కోటి కొట్టేశాడు
అసాధారణ ప్రయత్నాలతో ఎన్నో ఇబ్బందులను, సవాళ్లను అధిగమించామని.. ఇది ఎవరికీ కూడా సులభమైన ప్రయాణం కాదని చెప్పారు. కోవిడ్-19 ప్రారంభం అయినప్పటి నుంచి మేము ప్రజలు సంక్షేమం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చామని.. సాధ్యమైనంత వరకు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు శాస్త్రీయ విధానాలతో కోవిడ్ ను ఎదుర్కొన్నామని.. అధికారులు, ఆరోగ్య సిబ్బంది, వైద్య నిపుణులు, కమ్యూనిటీ కార్యకర్తలు అంతా కలిసి ఎంతో ధైర్యంగా పనిచేశారని జిన్ పింగ్ అన్నారు. ఇప్పుడు విశ్వాసం అనే కాంతిరేఖ ముందుందని.. దైర్యం, ఐకమత్యంతో శ్రమించి విజయం సాధిద్దాం అని జిన్ పింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రపంచం ఎప్పుడు చూడని విధంగా కరోనా మహమ్మారి ప్రబలుతోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణంగా అక్కడ లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి నెలలో ఏకంగా తారాస్థాయికి కేసుల సంఖ్య చేరుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడించాయి. ఏకంగా 60 శాతం మంది కోవిడ్ బారిన పడొచ్చని ఓ అంచానా. ఇక మరణాల సంఖ్య కూడా పెరిగింది. దేశం అంతటా ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన తర్వాత చైనాలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది.