Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News X Post Shows Nations That Deny Entry To Israelis Country Says Were Good

Israel: ఇజ్రాయిల్ పౌరుల్ని అనుమతించని దేశాలు ఇవే.. వైరల్ అవుతున్న పోస్ట్..

Published Date :March 17, 2024 , 3:30 pm
By BV Reddy
Israel: ఇజ్రాయిల్ పౌరుల్ని అనుమతించని దేశాలు ఇవే.. వైరల్ అవుతున్న పోస్ట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ముఖ్యం ముస్లిం దేశాల్లో ఇజ్రాయిల్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయిల్‌కి సంబంధించిన ఓ పోస్టు తెగవైరల్ అవుతోంది. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన వారిని అనుమతించని దేశాల లిస్టు వైరల్ అయింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే పేజీలో ఇజ్రాయిల్ పౌరులను తమ గడ్డపైకి అనుమతించనని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ముస్లిం మెజారిటీ కలిగిన దేశాలు ఉన్నాయి. అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, సిరియా, యెమెన్ ఉన్నాయి.

Read Also: Murder: సెల్‌ఫోన్‌ కోసం సొంత నానమ్మనే హత్య.. ఆపై..?

అయితే, ఈ జాబితాపై ఇజ్రాయిల్ స్పందించింది. ‘‘వి ఆర్ గుడ్’’ అని కామెంట్ చేసింది. ఇజ్రాయిల్ చట్టం ప్రకారం.. లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ శత్రు దేశాలుగా పేర్కొనబడ్డాయి. ఇజ్రాయిల్ పౌరులు ఈ దేశాలను సందర్శించాలంటే ఇజ్రాయిల్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. ఇజ్రాయిలీలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించే ఏకైక మిడిల్ ఈస్ట్ దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఉంది.

ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇజ్రాయిల్‌ని ద్వేషిస్తుండగా.. మరికొందరు సపోర్టు చేస్తున్నారు. 2024 నాటికి, ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులకు 171 దేశాలు వీసా-ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. అధిక మొబిలిటీ స్కోర్‌తో, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ర్యాంకింగ్ పాస్‌పోర్ట్‌లలో ఒకటి. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు హోల్డర్లు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణించొచ్చు. చైనా, భారత్, అమెరికా వంటి దేశాలకు ముందుగా వీసా అఫ్లై చేసుకోవాలి.

We’re good pic.twitter.com/GmiwEzZGck

— Israel ישראל (@Israel) March 14, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Israel
  • Israel Passport
  • Pakistan
  • UAE
  • viral news

తాజావార్తలు

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

  • New ATM Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం రూల్స్ ఛేంజ్.. పరిమితి ఎంత ఉంటుంది?

  • Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

  • Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఒవైసీ.. ఏకంగా 182 స్థానాల్లో పోటీ..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions