World Richest Families: ప్రపంచ ధనికుల కుటుంబం లిస్ట్ విడుదల.. అంబానీకి ఎన్నో ర్యాంక్ అంటే..!
- ప్రపంచ ధనికుల కుటుంబం జాబితా విడుదల
- ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి చోటు
- మొదటి స్థానంలో అమెరికాకు చెందిన ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల కుటుంబాల జాబితా విడుదలైంది. ప్రపంచంలోని 25 సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి అంబానీ కుటుంబానికి చోటు దక్కింది. 25 సంపన్న కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ 8వ స్థానంలో నిలిచింది. అంబానీ కుటుంబం అపారమైన సంపద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానం ఉందంటూ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్‌హౌస్‌లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. అంబానీ కుటుంబం సంపద 105.6 బిలియన్లుగా ఉన్నట్లుగా తెలిపింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార రాజవంశాల్లో ఒకరిగా వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, శక్తి, పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో పనిచేస్తుందని తెలిపింది. అదే సమయంలో డిజిటల్ సేవలు, స్థిరత్వం-ఆధారిత వెంచర్లలోకి కూడా విస్తరిస్తుందని పేర్కొంది.
అగ్ర స్థానం..
అమెరికాలో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబంగా పేర్కొంది. 513.4 బిలియన్ల నికర విలువతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మొదటిసారిగా అర ట్రిలియన్ డాలర్ల పరిమితిని అధిగమించింది. వాల్‌మార్ట్ ఇటీవలి ఆర్థిక సంవత్సరంలో 681 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రపంచవ్యాప్తంగా స్టోర్‌లు విస్తరిస్తున్నాయి.
ఈ ప్రత్యేక ర్యాంకింగ్‌లోకి ప్రవేశించడానికి కనీసం 46.4 బిలియన్ల నికర విలువ ఉండాలి. అలా ఉన్నవాళ్లనే సంపన్న కుటుంబాల జాబితాలో చేర్చుతారు. 2025 జాబితాలో నాలుగు ఖండాలకు చెందిన నాలుగు కొత్త కుటుంబాలు ఉన్నాయి. మెక్సికోకు చెందిన లారియా మోటా వెలాస్కో కుటుంబం. ఇటలీకి చెందిన డెల్ వెచియో కుటుంబం. సౌదీ అరేబియాకు చెందిన ఒలాయన్ కుటుంబాలు ఉన్నాయి.
జాబితాలో ఇతర కుటుంబాలు..
అల్ నహ్యాన్ కుటుంబం: అబుదాబి పాలక రాజవంశం. నికర విలువ 335.9 బిలియన్లుగా ఉన్నట్లు అంచనా. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నాయకత్వంలో సంపదను విస్తరిస్తోంది. పెట్రోలియం నిల్వల్లో ఎక్కువ భాగాన్ని సంపాదిస్తుంది.
అల్ సౌద్ కుటుంబం: సౌదీ అరేబియా రాజకుటుంబం. నికర విలువ 213.6 బిలియన్ల అంచనా. చమురు నిల్వల ద్వారానే సంపాదన. కుటుంబంలో సుమారు 15,000 మంది సభ్యులు ఉన్నప్పటికీ.. సంపద కేంద్రీకరణ సీనియర్ రాజకుటుంబంలో ముఖ్యంగా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఉంది.
అల్ థాని కుటుంబం: ఖతార్ పాలక కుటుంబం. నికర విలువ 199.5 బిలియన్లుగా అంచనా. 1940లో చమురు కనుగొన్న తర్వాత సంపద పెరిగింది. తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించుకునేందుకు అల్ థాని కుటుంబం ఇటీవల ట్రంప్‌కు విలాసవంతమైన బోయింగ్ 747ను బహుకరించింది.
హెర్మేస్ కుటుంబం: ఆరు తరాలుగా హెర్మేస్ కుటుంబం ఆదాయం 184.5 బిలియన్ల అంచనా. ఈ బ్రాండ్ అల్ట్రా-లగ్జరీ వస్తువులకు.. ముఖ్యంగా బిర్కిన్ హ్యాండ్‌బ్యాగ్‌కు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ గృహాలలో ఒకటిగా ర్యాంక్ పొందింది.
ఇది కూడా చదవండి: Maharashtra: ‘రమ్మీ’ మంత్రి మాణిక్‌రావ్ కోకటేకు మళ్లీ ఇక్కట్లు.. పదవికి రాజీనామా
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?